జగన్ అధికారం చేపట్టిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంస్కరణల బాటలో దూసుకుని పోతుంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఏ పాలకుని హయాంలో జరగనటువంటి సంస్కరణలు ఒక్క జగన్ పాలనలోనే జరిగాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తమ ప్రజలకి ఏపీ మోడల్ సంస్కరణలను అందించాలనే సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధుల బృంధం ఇప్పటికే ఏపీకి వచ్చి ఇక్కడ అమలులో […]
కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఎప్పుడూ ఆయన వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి.
రాష్ట్రం లో అన్ని ప్రధాన పార్టీ లు హోరా హోరీగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం తో ముగియనుంది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపద్యంలో పార్టీల ప్రచార మైకులు మూగబోనున్నాయి. 57రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తం గా అధినేతల సుడిగాలి పర్యటన లు పోటా పోటీగా అభ్యర్ధుల దుమ్మురేపిన ప్రచారాలతో రాష్ట్రం లో ఎన్నికల వేడి వేసవి వేడిని దాటిపోయిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని […]
ఓ వైపు మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కాకుండా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు చిరంజీవి, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుంచి పోటీ […]
ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున టీడీపీ, జనసేన పార్టీ సభ్యులకి గట్టి షాకే తగిలింది. పవన్ కళ్యాణ్ బీజెపీని ఓప్పించి టీడీపీతో బలవంతపు కాపురానికి దారులు వేసినా. బీజేపీ అయిష్టతతో ఆ కాపురం మాత్రం సజావుగా సగడం లేదు. కూటమిలో ఉన్నాం అంటే ఉన్నాం అనిపించుకుంటున్నారే తప్ప బీజేపీ ఎక్కడా ఎన్నికల్లో సీరియస్ గా ఫోకస్ పెట్టిన సందర్భాలు కనపడలేదు. కూటమి పేరున చంద్రబాబు మానిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో కూడా బీజేపీ పెద్దలు ఆ మానిఫెస్టోని […]
చంద్రబాబు అధికారంలో ఉంటే అయినవాళ్ళకి మాత్రమే దోచిపెడుతూ ప్రజలని ఎలా హింసిస్తాడో, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలని హింసించడంలో ఏమాత్రం తగ్గడని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు చేస్తున్నది దుర్మార్గపు రాజకీయమని తాము ఊరికే ఆరోపణలు చేయడం కాదని దానికి ఎన్నో సాక్ష్యాలే మన కళ్ళముందే ఉన్నాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు పేదలకు బద్ద వ్యతిరేకని పేదల నోటికాడ ముద్ద లాగేసినోడు రేపు పేదలకు మేలుచేస్తాడంటే ప్రజలు ఎలా నమ్ముతారనేది వారి వాదన. జగన్ 5ఏళ్ల పాలనలో […]
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులతో పోలిస్తే దూకుడుగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు పడనుంది. పిఠాపురం వేదికగా జరగబోయే బహిరంగ సభతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించడం విశేషం. చివరి 12 రోజుల్లో 34 సభల్లో జగన్ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన […]
ఈనెల 13 న జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మరో లేఖతో కలకలం సృష్టిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వాసులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భం లో కలిసిపోయేలా తీర్పుని ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో పేదవాడు కడుపునిండా అన్నం తినే పరిస్థితి ఉందని, పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే […]
పసుపు మీడియా, పసుపు పత్రికలు, ఐటీడీపీ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలను నమ్మి ఎవరైనా చంద్రబాబు పార్టీకి ఓటు వేద్దామనే ఆలోచన ఉంటే వారు మరొకసారి ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు వైసీపీ మద్దతు దారులు. ఇప్పటికి మించిపోయింది లేదని వారి ప్రచారాన్ని కాసేపు పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్ చెబుతునట్టు మీ ఇంట్లో మేలు జరిగిందో లేదో ఇంట్లో ఉన్న పెద్దవారితో, మహిళలతో చర్చించాకే నిర్ణయం తీసుకోమనేది వారి మాట. పొరపాటు జరిగితే […]
వైయస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర తరువాత అందుకున్న విజయం ఆయన జీవితంలో ఒక మైలురాయిగానే చెప్పాలి. అలాగే ఆయన 5ఏళ్ళ సుపరిపాలనను సైతం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో మైలురాయే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ పాలనకు ముందు , ఆ తరువాత అని చెప్పుకునే విధంగా సాగింది. జగన్ పాలనలో గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమం అభివృద్ది, పరిపాలన సంస్కరణలు సాగాయని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకునే అంశం. అయితే జగన్ […]