ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 8 బంతుల్లో 66 (6 సిక్సులు, 5 ఫోర్లు ) పరుగులతో దూకుడుగా ఆడాడు ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ (42) పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) పరుగులతో రాణించడంతో హైదరాబాద్ లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు సంపాదించారు.హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్లో అత్యధికంగా ప్రభ్సిమ్రాన్ సింగ్ 71 పరుగులు (4 సిక్సులు, 7 ఫోర్లు) చేశాడు. ఆ తర్వాత అథ్వారా థైడే (46), రిలీ రోసో (49) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలింగ్లో నటరాజన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కమిన్స్, విజయ్ కాంత్, వియస్కాంత్ తలో వికెట్ సాధించారు. కాగా.. హైదరాబాద్ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. అభిషేక్ శర్మ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది,బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్ బెంగళూర్ తో తలపడనుంది