నేడు ఐపీఎల్-2024 లో భాగంగా సాయంత్రం 7:30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైతో ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది ఈ రెండు జట్లలో ఏ జట్టు విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా దాటాల్సి ఉంటుంది . ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. బెంగళూరు రన్‌రేట్ 0.387గా ఉంది. అది మెరుగుపడాలంటే, రెండు సమీకరణాలు ఉన్నాయి.
ఒకవేళ బెంగళూరు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే.. 200 పరుగులకు మించి స్కోరు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. అలా కాకుండా ఒక్క పరుగు తేడా కొట్టినా.. అంటే 17 పరుగులతో విజయం సాధించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు చెన్నై ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్స్‌కి చేరిపోతుంది. బెంగళూరు ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే,దాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి, అలా కాకుండా ఒక బంతి తేడా కొట్టినా బెంగళూరు గెలిచినప్పటికీ ఇంటిబాట పట్టక తప్పదు. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని 18.1 బంతుల్లో తప్పకుండా ఛేంజ్ చేయాలి. మరి బెంగళూరు జట్టుకి ఇది సాధ్యమవుతుందా ? లేదా అనేది ఇవాళ్టి మ్యాచ్ లో చూడాలి
ఇంకో పక్క ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంది, దీంతో ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే అది బెంగళూరు కి తీరని నష్టం చేకూరుస్తుంది. మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు బెంగళూరు 13 పాయింట్లతో ఉండగా, 15 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
ప్లేయింగ్ ఎలెవన్ అంచనా :
చెన్నై సూపర్ కింగ్స్ :
రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), డారిల్ మిచెల్, మోయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్రసింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
విరాట్ కోహ్లి, డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ఫెర్గూసన్