కొంతమంది టీడీపీ నాయకులు చూపిస్తున్న అతి తెలివితో ఆ పార్టీ క్యాడర్ బలైపోతుందనే వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి పెట్టిన ఖర్చును ఒక్క దెబ్బతో రాబట్టుకునే పథకం మూలాన టీడీపీ క్యాడర్ కుదేలైపోతుంది. కొన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సమాచారం ప్రకారం టీడీపీ నుండి పోటీ చేసిన వ్యక్తులే గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ గెలుస్తుందని పందెం కాయడంతో కింద స్థాయి కార్యకర్తలు అవాక్కవుతున్నారు. టీడీపీ అభ్యర్ధులు వైసీపీకి గెలుపుపై బెట్టింగ్ కట్టడం ఏంటో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.
అయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాపార తెలివితేటలపై పూర్తిగా అవగాహన ఉన్న వారు చెబుతున్న మాట ప్రకారం చూస్తే ఎన్నికల్లో ఓట్లు వేటలో డబ్బులు ఖర్చు చేసుకున్న అభ్యర్ధులకి తిరిగి ఆ డబ్బును సపాదించుకునే మార్గం అధినేత చంద్రబాబే చూపినట్టు వారు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే తన అనుకూల ఎల్లో మీడియాలో తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వస్తుందని పూర్తి స్థాయిలో ప్రచారం చేసి, ప్రజలు ఒక నిర్ధారణకి వచ్చారని సమాచారం రాగానే ఇక టీడీపీ అభ్యర్ధులే మధ్యవర్తుల చేత వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ పెట్టి పూర్తి స్థాయిలో లాభపడి పోగొట్టుకున్న సొమ్ముని తిరిగి తెచ్చుకునే ఎత్తుగడ వేసినట్టు ప్రచారం జరుగుతుంది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు ఆ పార్టీలోని కొంతమంది నాయకులు , ఇటు ఎల్లో మీడియా కలిసి ఆడిన వ్యాపార ఆటలో సమిధిలుగా మారింది మాత్రం ఆ పార్టీ కార్యకర్తలే అనే మాట వినిపిస్తుంది. తెలుగు దేశం అనుకూల మీడియా మాటలు నమ్మి తెలుగుదేశం గెలుస్తుందని పెట్టిన బెట్టింగ్ కారణంగా రేపటి రోజున తాము బలైపోతున్నామనే ఆందోళన వారిలో పెరిగిపోతుంది. నాయకుల మాటలు , ఒక వర్గ మీడీయా మాటలు నమ్మి సొమ్ముతో చెలగాటం ఆడితే రోడ్డున పడేది సామాన్యులే అనే మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని జూదానికి దూరంగా ఉండాలని మేధావులు చెబుతున్న మాట.