టీడీపీ హయాంలో చంద్రబాబు సీఎంగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తోపాటు ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఇలా పలు అవినీతి కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినట్టు చంద్ర బాబు ఆస్థాన పత్రికగా ముద్ర పడిన ఒక ప్రముఖ పత్రిక న్యూస్ ని ముద్రించింది అయితే ఆ న్యూస్ ని టీడీపీ ఎన్నారై విభాగం ఇంఛార్జి తప్పుడు న్యూస్ గా కొట్టిపారేయడంతో టీడీపీ క్యాడర్ తో పాటు అందరిలోనూ కలకలం రేగింది
పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు కోర్టు అనుమతులు లేకుండా విదేశాలకి వెళ్లకూడదని సీఐడీ గతేడాది లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులకి తెల్పగా చంద్రబాబును విమానాశ్రయంలోనే కాసేపు నిలిపినట్టు తెలిసింది, విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా? అని చంద్రబాబుని ప్రశ్నించడంతో ఆయన కంగుతిన్నట్టు తెలుస్తుంది, పలు దఫాల్లో అయన ఇచ్చిన వివరణను సీఐడీ అధికారులతో చర్చించిన అనంతరం ఎట్టకేలకు చంద్రబాబుకి అనుమతించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉన్నారు
అయితే చంద్రబాబు కంటే ముందే నారా లోకేష్ కూడా అమెరికా వెళ్ళిపోయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకి తన పర్యటన వివరాల గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జగన్ ఫ్యామిలీతో అన్ని అనుమతులు తీసుకుని విదేశాలకి వెళితే ఒక వర్గం మీడియా, వెబ్సైట్ లు చేసిన హంగామా అంతా ఇంతాకాదు, మరి అదే చంద్రబాబు విషయంలో ఆ వర్గాలు ఎందుకు మౌనంగా ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.