చంద్రబాబు అధికారంలో ఉంటే అయినవాళ్ళకి మాత్రమే దోచిపెడుతూ ప్రజలని ఎలా హింసిస్తాడో, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలని హింసించడంలో ఏమాత్రం తగ్గడని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు చేస్తున్నది దుర్మార్గపు రాజకీయమని తాము ఊరికే ఆరోపణలు చేయడం కాదని దానికి ఎన్నో సాక్ష్యాలే మన కళ్ళముందే ఉన్నాయని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు పేదలకు బద్ద వ్యతిరేకని పేదల నోటికాడ ముద్ద లాగేసినోడు రేపు పేదలకు మేలుచేస్తాడంటే ప్రజలు ఎలా నమ్ముతారనేది వారి వాదన. జగన్ 5ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తుంటే వాటిని పేదలకు అందకుండా నిస్సిగ్గుగా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదని, ఇలాంటి చంద్రబాబుకి పొరపాటున ఓటు వేస్తే, ఇంకెంత అరాచకం సృష్టిస్తాడో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు.
జగన్ 5ఏళ్ల పాలనలో చంద్రబాబు ఆడిన నీచ రాజకీయం చూస్తే అవ్వాతాతల ఉసురు పోసుకుంటూ 66.34 లక్షల మంది అవ్వాతాతలకు ఒకటో తేదీనే ఠంచనుగా అందే పింఛను అందకుండా వాళ్ల ఉసురు తీసిన దుర్మార్గం చంద్రబాబుది. 5 కోట్ల మంది సామాన్యులకు నిస్వార్థంగా, అవినీతికి తావులేకుండా ఇంటింటికీ వెళ్లి అందిస్తున్న వాలంటీర్ల సేవలను అడ్డుకున్న నీచ వ్యక్తిత్వం చంద్రబాబుది. అలాగే 84 లక్షల మంది పేద విద్యార్థులకు ఇంగ్లీష మీడియం చదువులు వద్దని కోర్టుకెక్కి అడ్డుకున్న పాపం చంద్రబాబుది. 30 లక్షల మంది పేదరికం ప్రాతిపదికన ముస్లింలకు అందుతున్న 4% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నవారితో జతకట్టిన దుర్మార్గపు వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అంటున్నారు.
అలాగే 34.41 లక్షల మంది రైతులకు క్రమం తప్పకుండా ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని అడ్డుకున్న రైతు ద్రోహి ఈ చంద్రబాబు. ఇంకా చూస్తే 9.44 లక్షల మంది విద్యార్ధులకు విద్యాదీవెన అందకుండా అడ్డుకున్న నీచం చంద్రబాబుది. 78.94 లక్షల మందికి వైయస్సార్ ఆసరా, 4.95 లక్షల మందికి వైయస్సార్ ఈబీసీ నేస్తం, 31 లక్షల మందికి వైయస్సార్ చేయూత పథకాలు అందకుండా అడ్డుకున్న రాక్షసత్వం చంద్రబాబుది ఇది అక్కచెల్లెమ్మలకు కూటమి చేసిన ద్రోహం కాదా. ఇంకా చెప్పుకుంటూ పోతే అమరావతిలో పేదలు, దళితులకు ఇళ్ల పట్టాలిస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకున్న కులదురహంకారం చంద్రబాబుది. ఇంతమందికి ద్రోహం చేసి రేపు అన్నీ ఉచితంగా ఇస్తానంటున్న ఆల్ ఫ్రీ బాబు అబద్ధాలను ప్రజలు నమ్మేస్తారా అంటూ నేరుగా చంద్రబాబు దుర్మార్గాలను వైసీపీ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.