ఏపీలో ఎన్నికలు అయిన రోజు నుంచే బెట్టింగ్ ఫేవరెట్ గా టీడీపీ మారడానికి తెలుగుదేశం & ఎల్లో మీడియా కలిసి చేయని కుట్రలు లేవు. తెలుగుదేశం గెలవబోతుందని ప్రచారం చేసి బెట్టింగ్ ఫెవరెట్ గా టీడీపీని మార్చి ఆ తరువాత బినామీల చేత వైసీపీకి అనుకూలంగా బెట్టింగ్ వేసి ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుని తిరిగి రాబట్టుకునే ఎత్తుగడని టీడీపీలోని కొంతమంది లోపాయకారీగా చేస్తున్నారనే వాదన బలంగా ఉంది . అయితే ఈ వాదనకి మరింత బలాన్ని చేకూర్చేలా టీడీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన ఫేక్ ప్రచారం బయటపడింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్ ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందుస్తాన్ టైమ్స్ కి చెందిన లాజికల్ ఫాక్ట్స్ విభాగం పరిశోధన చేసి బయటపెట్టింది.
ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ పేరున సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతున్న స్క్రీన్‌షాట్ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల అనంతరం “టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయని” దీని ప్రకారం టీడీపీ గెలుస్తుందని “ఇది సాక్షి లేదా TV9 కాదని, ఇది టైమ్స్ నౌ ఛానెల్ అని, ఐ-టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారి సోషల్ మీడీయా ఛానల్స్ లో ప్రచారం చేసినట్టు తాము గుర్తించామని అయితే, ఈ స్క్రీన్ షాట్ పూర్తిగా కల్పితమని, 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్‌ను మార్ఫ్ చేసి స్క్రీన్‌షాట్ తీసి, ఆంధ్రప్రదేశ్ ది గా ఉద్దేశపూర్వకంగా మార్చబడిందని స్పష్టం చేసింది.
తాము నిజనిజాలు తెలుసుకోవడానికి టైమ్స్ నౌ కు చెందిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్లను శోధించామని, కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచురించబడిన డేటా ఎక్కడా కనుగొనబడలేదని తేల్చి చెప్పింది. 2021లో ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్‌ను ప్రచురించేటప్పుడు టైమ్స్ నౌ ఇదే విధమైన టెంప్లేట్‌ను ఉపయోగించినట్లు తాము చేసిన రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెల్లడైందని, నవంబర్ 16, 2021న టైమ్స్ నౌ ప్రచురించిన ఈ ఒపీనియన్ పోల్ లోని స్లైడ్ తారుమారు చేసినట్లు తాము కనుగొన్నామని, నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న మాత్రమే విడుదల చేయబడతాయని” స్పష్టం చేసింది. దీంతో టీడీపీ పనికట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలు మరోసారి బయటపడినట్లైంది.