రాష్ట్రం లో అన్ని ప్రధాన పార్టీ లు హోరా హోరీగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం తో ముగియనుంది. మరో 48 గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపద్యంలో పార్టీల ప్రచార మైకులు మూగబోనున్నాయి. 57రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తం గా అధినేతల సుడిగాలి పర్యటన లు పోటా పోటీగా అభ్యర్ధుల దుమ్మురేపిన ప్రచారాలతో రాష్ట్రం లో ఎన్నికల వేడి వేసవి వేడిని దాటిపోయిందనే చెప్పాలి. ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల అభ్యర్ధులు భారీ ఏత్తున రోడ్ షోలకి , ర్యాలీలకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక సీఎం జగన్ తన ఫినిషింగ్ టచ్ ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యప్తంగా 57రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచార శైలిని పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు వెళ్ళబుచ్చుతున్న అభిప్రాయాలను చూస్తే జగన్ తన ప్రచారం లో ఎంతో స్పష్టత తో వ్యవహరించారని గతంలో ఏ రాజకీయ నాయకుడు చెప్పని విధం గా తన పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయమని ఓటర్లని కోరడం ఒక ట్రెండ్ సెట్ అని ఈ మాట చెప్పాలంటే తన పాలన పై ఎంతో నమ్మకం ఉండాలని జగన్ ప్రజలకు చేసిన మేలు పై ఎంతో నమ్మకం తో ఉన్నట్టు తన ప్రచారంతోనే స్పష్టమైందని వారి అభిప్రాయాలని పంచుకున్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొత్తం అసత్యాలు, అభూత కల్పనలు, అసభ్య పదజాలమే తప్ప ప్రజలకు తాము ఏమి చేయబోతున్నారో చెప్పడంలో పూర్తిగా విఫలం చెందారని చెబుతున్నారు. ఏది ఏమైనా వీరి ప్రచారాలకి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. అభ్యర్ధులు చేసిన ప్రచారానికి ఫలితాలు ఎలా వస్తాయి, ప్రజలు ఎవరి కి పట్టం కట్టబోతున్నారో కొద్ది రోజుల్లోనే తేలిపొనుంది.