ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ లో స్థానం ఖరారుయే లక్ష్యంగా హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన గుజరాత్ టైటాన్స్ విజయంతో సీజన్‌ను ముగించాలని చూస్తుంది
రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటములు హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చాయి భారీ రన్ రేట్‌తో గెలిచి టాప్-2లో నిలవాలనే పట్టుదలతో జట్టు హైదరాబాద్ ఉంది . ఈ సీజన్లో వరుస విజయాలతో అందరి కంటే ముందే ప్లే ఆఫ్స్ చేరేలా కనిపించిన రాజస్థాన్.. వరుసగా నాలుగు ఓటములతో ఢీలా పడింది. దీనితో ఆ జట్టు టాప్-2లో నిలవడం కష్టంగా మారింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించే సువర్ణ అవకాశం సన్ రైజర్స్ హైదరాబాద్‌కు వచ్చింది.