ఇప్పటికే పార్టీలేదు బొ* లేదు అన్న అచ్చం నాయుడి వీడియో లీక్ కావడం, పార్టీ ఓడిపోతుందని తెలుగుదేశం అభ్యర్ధులే మీటింగ్ లో చెప్పిన వీడియో లీక్ కావడంతో ఈ లీకుల బెడద నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం శ్రేణులకి మరో బాంబులాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి బూతులు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయి వారి మెడకు చుట్టుకుంది.
తెలుగుదేశానికి లీకుల బెడద ఇప్పట్లో తప్పేలా కనిపించడంలేదు. ఇప్పటికే పార్టీలేదు బొ* లేదు అన్న అచ్చం నాయుడి వీడియో లీక్ కావడం, పార్టీ ఓడిపోతుందని తెలుగుదేశం అభ్యర్ధులే మీటింగ్ లో చెప్పిన వీడియో లీక్ కావడంతో ఈ లీకుల బెడద నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం శ్రేణులకి మరో బాంబులాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి బూతులు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయి వారి మెడకు చుట్టుకుంది. భువనేశ్వరి ఆడియో లీక్ అవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా కుదుపుకు గురైందనే చేప్పాలి.
ఇదిలా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇంకొద్ది గంటల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరో ఆడియో లీక్ మెడకు చుట్టుకుంది. ఈ సారి ఈ ఆడియో ఏకంగా చంద్రబాబుది కావడం గమనార్హం .. సదరు ఆడియోలో చంద్రబాబు గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తికి ఆయన సమాధానం ఇస్తూ అన్న మాటలు ఏపీని మరోసారి కుదిపేసేలా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ ఎలాగైనా గెలుస్తాం, పవర్ లోకి వచ్చేది మనమే, పథకాల్లేవ్ ఏం లేవ్, మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయ్, అమరావతిని అభివృద్ది చేస్తాం , నువ్వు ఊహించనంత రిటర్న్స్ ఉంటాయి అంటూ చంద్రబాబు మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వ్యహారంపై తెలుగుదేశం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.