ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం ముగిసినా ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలింగ్ సరళి సర్వే సంస్ధలతో పాటు పేరెన్నికగన్న సెఫాలజిస్టులకు కూడా అంతుచిక్కడం లేదు. ఓవైపు కూటమికే విజయావకాశాలు ఉన్నాయని ఎల్లో మీడియా & టీడీపీ అనుకూల ఛానెళ్లు ఊదరగొడుతున్నాయి. మరోవైపు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మాట్లాడుకునే విధంగా 2019 ఎన్నికలకు మించి ఘన విజయాన్ని సాధిస్తుందని స్పష్టం చేయడంతో ఆంధ్రప్రదేశ్ ఫలితాలు రసకందాయంలో పడ్డాయి.
కాగా ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు గురించి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై విశ్లేషిస్తూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలకపల్లి రవి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను ఓ తెలుగుదేశం పార్టీకి చెందిన మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు గెలిస్తే 8th వండర్ అవుతుందని అతను వ్యాఖ్యానించాడని వెల్లడించారు. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ కి చెందిన నాయకుడే ఇలా వ్యాఖ్యానించడం చూస్తుంటే కుప్పంలో చంద్రబాబు గెలవడం అసాధ్యంగానే కనపడుతుంది.
కాగా ఎన్నికల్లో గెలుపుపై సీఎం జగన్ ఖచ్చితంగా గెలవబోతున్నాం అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా కూటమి వైపు నుండి ఏ ఒక్క నేత స్పష్టమైన ప్రకటన చేయకుండటం టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి గెలుపుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లో మీడియాలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న టీడీపీ, లోలోపల ఓటమి భయంతో కుమిలిపోతున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓటమి, గెలుపు భయాలు ఆయా పార్టీల నేతలను వెన్నాడుతూనే ఉంటాయి