వైయస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్ర తరువాత అందుకున్న విజయం ఆయన జీవితంలో ఒక మైలురాయిగానే చెప్పాలి. అలాగే ఆయన 5ఏళ్ళ సుపరిపాలనను సైతం రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో మైలురాయే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ పాలనకు ముందు , ఆ తరువాత అని చెప్పుకునే విధంగా సాగింది. జగన్ పాలనలో గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని విధంగా సంక్షేమం అభివృద్ది, పరిపాలన సంస్కరణలు సాగాయని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకునే అంశం. అయితే జగన్ పరిపాలనలో చెప్పుకోదగ్గ సంక్షేమాభివృద్ది అంశాలు అనేకం ఉన్నా వీటిలో మరీ ముఖ్యంగా చెప్పుకునే అంశాలు మాత్రం విద్య, వైద్యం, వ్యవసాయం. వీటిలో తెచ్చిన సంస్కరణలు దేశానికే దిక్సూచి అని చెప్పాలి.
విద్యలో జగనన్న అమ్మఒడి, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం చదువులు, డిజిటల్ బోధన, బైలింగ్యుల్ టెక్స్ట్ బుక్స్ లాంటి సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇక వైద్యరంగంలో వైయస్సార్ ఆరోగ్య శ్రీ, వైయస్సార్ ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్ లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి సంస్కరణలతో పేదోడికి ఖరీదైన నాణ్యమైన వైద్యాన్ని దగ్గర చేశారు, ఇక వ్యవసాయ రంగంలో వైయస్సార్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్తు, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ వంటి వినూత్న పథకాలతో ఇతర రాష్ట్రాల కన్నా మెరుగ్గా రైతు జీవితాల్లో వెలుగులు నింపారు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయంలో వైసీపీ మార్క్ పాలన దేశానికే ఒక గొప్ప మార్గమనే చెప్పాలి.