ఓ వైపు మెగా ఫ్యామిలీతో పాటు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కాకుండా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఓవైపు చిరంజీవి, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు అల్లు అర్జున్ మాత్రం నంద్యాల నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఆయన అల్లు అర్జున్ కి స్నేహితుడు కావడంతో తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆతిథ్యం స్వీకరించనున్నారు.
ఇప్పుడీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలు లేవని వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పరోక్షంగా జనసేనను కాదని వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కొత్త చర్చకు దారి తీసింది. మరి ఈ వ్యవహారంపై మెగా హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి..