మొత్తం జనాభాలో కనీస 50% దళితులు ఉండి లేదా ఆ దళితుల జనాభా 500 కు పైగా ఉన్నా ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోను సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే.. ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదేళ్లలో రూ. 45,412 కోట్లు ఇవ్వగలిగాం. నాన్ డీబీటీ ద్వారా మరో […]
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకి ఇవ్వకుంటే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకొని పోటీ చేస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. 2019 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం పాలైన అందరూ పవన్ కళ్యాణ్ ని విడిచి వెళ్ళిపోతుంటే నేను మాత్రం ఆయనకు అండగా ఉన్నానని తెలిపాడు. 2024 సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు ప్రకటనలో నీ పేరు మొదటి లిస్టులో ఉంటుంది, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని బాగా […]
ఎప్పుడు ఏదో పిచ్చి పని చేస్తూ జనాలను నవ్వించే పాల్ మామ మరో పిచ్చి పనితో మన ముందుకు వచ్చాడు.. ఏపీ లో సార్వత్రిక ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించేలా ఎన్నికల కమీషన్ ను ఆదేశించాలని హై కోర్ట్ ను ఆశ్రయించగా, హై కోర్ట్ తిరస్కరించింది.. చివరి విడతలో ఎన్నికలు నిర్వహించి వెనువెంటనే ఓట్ల లెక్కింపు చేయడం వలన ఏవీఎం ల ట్యాంపరింగ్ ను నిరోధించవచ్చని పాల్ గారి అభ్యర్థన. […]
ఎన్నికలు మొదలవుతుండగా జరిగే సర్వేల కోసం రాజకీయ పార్టీలు, నాయకులు, ఓటర్లు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక రకంగా ఎన్నికలకి ప్రీ ఫైనల్ రిజల్ట్స్లా ఈ సర్వేలను భావించొచ్చు. మరీ బొత్తిగా రాజకీయ నాయకుల చేతిలో ఉన్న మీడియా సంస్థలు చేసే సర్వేలు తప్ప, మిగిలినవన్ని నిస్వార్థంగానే సర్వే ఫలితాలను చెప్తూ ఉంటాయి. అటువంటి సర్వేలు మరొకసారి చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నాయి. 2019 ఎన్నికల ముందు వచ్చిన సర్వేలలో టీడీపీ తక్కువగానే స్కోరు చేయబోతోంది […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 2024 ఎన్నికల్లో 24 అసెంబ్లీ , 3 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయనున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించారు. గతంలో పది సీట్లకో, పదిహేను సీట్లకో తన ఆత్మ గౌరవం తాకట్టు పెట్టలేనని చెప్పిన పవన్ కళ్యాణ్, నేడు కేవలం 24 సీట్లలో ఎలా పోటీ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కు ఆత్మ గౌరవం లేదా అనే సందేహాలు సామాన్యుల్లో […]
రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది జాబితా తయారుచేయాలని, ప్రతి జిల్లాలో సిబ్బంది సంఖ్య ప్రాధమిక అంచనా కంటే 20% అదనంగా అధికాంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది నిర్వహణ, ఓటరు జాబితా తయారీ, ఓటరు గుర్తింపుకార్డుల […]
ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే గడువుంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులతో, తాము ఎన్నికలకు ‘సిద్ధం’గా ఉన్నామని అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తమవుతుండగా, రా కదలిరా.. శంఖారావం అంటూ చంద్రబాబు లోకేష్ టీడీపీ శ్రేణులను ఉత్తేజితం చేస్తున్నారు. కాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఇచ్చిన ఆదేశాలకు ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో అన్న అనుమానం ప్రజల్లో కలగడం ఖాయంగా కనిపిస్తుంది. ఎన్నికల విధుల్లో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వినియోగించడానికి కేంద్ర […]
2019లో వీచిన ఫ్యాన్ గాలికి తెలుగుదేశం కొట్టుకుపోయింది. అప్పటి ఎన్నికల ఫలితాలనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా మర్చిపోలేదు. 24లో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆయనకు వివిధ సర్వేల ఫలితాలు గట్టి షాక్‌లు ఇస్తున్నాయి. ఈసారి కూడా జగన్ ప్రభంజనం సృష్టిస్తాడని ఆయా సంస్థలు కుండబద్ధలు కొట్టి చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఆరు జిల్లాల్లో సర్వే చేసి ఈ ఏడాది జనవరి 19న ఫలితాలు వెల్లడించింది. దీని ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ […]
చంద్రబాబుకు రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలని ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మండల ఆత్మియ సమావేశంలో మాట్లాడిన నాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్లు ఎంపీ టికెట్లు అమ్ముకుని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎంపీగా తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన నాని 3 లక్షల పైచిలుకు ఓట్ల […]
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు అధికారుల బదిలీలు చివరి దశకు చేరుకోగా.. మరోవైపు శాంతిభద్రతలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో ఉన్నతాధికారులు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విభాగాలను ప్రారంభిం సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను నియమించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, గత ఎన్నికల కేసుల్లో ఉన్న వారి బైండోవర్ ప్రక్రియ కొనసాగుతోంది. లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసుకుంటున్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి గ్రామాలను […]