పవన్ కళ్యాణ్ ని కాపు నేతలు నమ్మడం లేదా? కాపులంతా పవన్ కళ్యాణ్ కి దూరమయ్యారా? ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఈసారి కూడా సత్తా చాటలేరా? అంటే అవుననే సమాధానం వస్తుంది. నిలకడలేని రాజకీయాలకు నెలవుగా మారిన పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన కొత్తలో కాపులలో కొత్త ఆశలు రేకెత్తించారు. తిరుగులేని కాపు నాయకుడిగా ఎదుగుతాడని ఆశిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబుకు ఊడిగం చేస్తూ కాపు ఓటింగ్ ని గంపగుత్తుగా టీడీపీకి తాకట్టు […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికలలో బరిలోకి దిగేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించిన తమిళిసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసేందుకు వీలుగా ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం […]
తెలంగాణాలో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని అంతగా బలం లేని పార్టీగా చెప్పుకోవచ్చు. గత ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో 108 స్థానాల్లో పోటీకి దిగిన బీఎస్పీ అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి, కేవలం 1.08% ఓటు షేరును మాత్రమే సాధించగలిగింది. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ రెండు సీట్లు కేటాయించింది. పొత్తులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలలోని నాగర్‌ర్నూల్‌తో […]
గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లు ఆదివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేసి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులకు ముమ్ముర దర్యాప్తు చేపట్టడంతో పలువురు సెలెబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో టాలీవుడ్ బడా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఉండడం గమనార్హం. […]
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలపై, ఇసుక దోపీడీలపై వరుస కథనాలు రాస్తూ వస్తున్న తెలంగాణం పత్రిక-న్యూస్ లైన్ తెలుగు ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ శంకర్ పై నిన్న రాత్రి పాశవికంగా దాడి జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది రౌడీ మూకలు ఒక్కసారిగా శంకర్ ను చుట్టుముట్టి దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన అతని ఆఫీసు […]
బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో వెనుక సీట్ లో ప్రయాణిస్తున్న లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. […]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రైల్వే బడ్జెట్ వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ. 14 వేల 209 కోట్లు కేటాయించగా ఆంధ్ర ప్రదేశ్‌లోని రైల్వే మౌలిక, రక్షణ సంబంధించిన ప్రాజెక్టుల కోసం రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు రెండు […]
మా కుటుంబానికి సీఎ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల మంచి జరిగిందని ఎవరైనా చెబితే అంతే సంగతి. తెలుగుదేశం, జనసేన, వాళ్ల సోషల్ మీడియా, ఎల్లో మీడియా పనిగట్టుకుని చెప్పిన వారిని రోడ్డుకు లాగేంత వరకు నిద్రపోవడం లేదు. ఏ మాత్రం కనికరం లేకుండా వారిపై దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఇలా చేయడం నీచమని తెలిసినా ఎల్లో గ్యాంగ్ రెచ్చిపోతోంది. పేదల కడుపు కొడుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులరైన కుమారి ఆంటీ విషయంలో ఇదే జరిగింది. దాసరి […]
చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసిన ఎవరికీ ఆయనకున్నంతటి విజనరీ అబ్బలేదు అని అనుకునే సమయానికి దరిమిలా రేవంత్‌రెడ్డి సీయం అవడం, అయ్యాక ఆయనిస్తున్న స్టేట్మెంట్స్ చూడటంతో రాజకీయ జనానికి చాలా క్లారిటీ వచ్చింది. సేం టు సేం గురువులానే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు. సీయం సీటు అందుకున్న రెండో రోజే గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ముందుంచి ఇక మేం చేయగలం అని చెప్పినప్పుడే రేవంత్ తాను చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవబోతున్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు […]
ఊర్లో ఎక్కడ ఏం జరిగినా.. బెడ్రూంలోకి కూడా దూరిపోయి న్యూస్ అందించడానికి వెనుకాడని పత్రికను నడిపే ఆ అధినేత మాత్రం తన సంస్థలో జరిగిన అతి ఘోర ప్రమాదాన్ని బయటకు రానీయకుండా చేసిన వైనమిది. ఇందులో నష్ట పడ్డవారు ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన వారు కాబట్టి ఈ మాత్రం వివరాలైనా బయటకొస్తున్నాయి కానీ, అదే సామాన్య మనుషులనైతే తమ డబ్బు బలంతో, రాజకీయ అండతో నోరు నొక్కేసేవారే! ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీ విస్టెక్స్ తన […]