పసుపు మీడియా, పసుపు పత్రికలు, ఐటీడీపీ ఆధ్వర్యంలో నడిచే టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలను నమ్మి ఎవరైనా చంద్రబాబు పార్టీకి ఓటు వేద్దామనే ఆలోచన ఉంటే వారు మరొకసారి ఆలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు వైసీపీ మద్దతు దారులు. ఇప్పటికి మించిపోయింది లేదని వారి ప్రచారాన్ని కాసేపు పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్ చెబుతునట్టు మీ ఇంట్లో మేలు జరిగిందో లేదో ఇంట్లో ఉన్న పెద్దవారితో, మహిళలతో చర్చించాకే నిర్ణయం తీసుకోమనేది వారి మాట. పొరపాటు జరిగితే దాని ప్రభావం మీ ఒక్కరిమీదే పడదని కోట్లాది మంది జీవితాలపై పడుతుందని , మంచి పాఠశాలల్లో చదివే అవకాశం పిల్లలు కోల్పోతారని, పెన్షన్ కు పెద్దలు దూరమవుతారని, పేదల జీవితాలకి భరోసాగా ఉన్న సంక్షేమ పథకాల్లో కోతలు పడతాయని కాబట్టి ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చంద్రబాబు 2014లో ఇచ్చిన మానిఫెస్టోని చెత్తబుట్టలో పారేయటం మర్చిపోకూడదని నాడు ఇచ్చిన హామీలైన 87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ 14,205 కోట్ల పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు రద్దు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 డిపాజిట్, ఇంటింటికీ ఉద్యోగం, ప్రతి నెలా 2,000 చొప్పున 5 ఏళ్ల కు 1.20 లక్షల నిరుద్యోగ భృతి, అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు ఇళ్లు, 10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, రాష్ట్రాన్ని సింగపూరుకు మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ లాంటి 600 హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చని చంద్రబాబు నేడు సూపర్ సిక్స్ , సూపర్ సెవన్ అంటూ చేస్తున్న వాగ్దానాలకి గ్యారెంటీ ఎక్కడదని, కావున చంద్రబాబు వస్తే మళ్ళీ మోసమే చేస్తాడని ఇదే ఆయన ట్రాక్ రికార్డ్ అని కాబట్టి ప్రజలందరు ఓటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండి ఓటు వేయాలని వారు మనవి చేస్తున్నారు.