వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. జూన్ 4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీనే కాకుండా చంద్రబాబు సైతం కుప్పంలో ఓడిపోబోతున్నాడని స్పష్టం చేశారు. చంద్రబాబు కుప్పంలో సుమారు ఏడు సార్లు గెలిచారని అయితే 8వ సారి ఇప్పుడు ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు. తనని ప్రజలు తిరస్కరించారనే సమాచారం ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు ఫ్రస్టేషన్ లో అందరిని తూలనాడుతున్నాడని, ఓటమి పాలవుతున్న సమయంలో ఆ మాత్రం అసహనం సహజమేనని ఎద్దేవ చేశారు.
కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం తెలుగుదేశం ఓటమిపాలైన దగ్గరనుండి చంద్రబాబు తనపై,సీఎం జగన్ పై మరింత కక్ష పెంచుకున్నారని, ఈ కారణం చేతనే తనపై ఎప్పుడు పసలేని ఆరోపణలు చేస్తూ అక్కసు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని, ప్రజలు చంద్రబాబుని ఇక ఔట్ డేటెడ్ పొలిటీషియన్ గానే చూస్తున్నారని, ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు రాజకీయ సమాధికావడం ఖాయమని అందుకే టీడీపీ నేతలు గూండాల్లా వ్యవహరించారని, వారిని ప్రోత్సహించి దాడులు చేయించింది చంద్రబాబేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేఖరుల సమావేశంలో వివరించారు.