ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే కనుమరుగు కావడం ఖాయమని భావించిన టీడీపీ ఎలాగైనా గెలవాలని కుట్రలకు తెరతీసింది. సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేసి అనేక పథకాలను వారికి నేరుగా అందించడమే కాకుండా పలు కీలక పదవులను మహిళలకు కట్టబెట్టి మహిళల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఏపీలో ఎన్నికలకు ఇంకో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది.. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే కనుమరుగు కావడం ఖాయమని భావించిన టీడీపీ ఎలాగైనా గెలవాలని కుట్రలకు తెరతీసింది. సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేసి అనేక పథకాలను వారికి నేరుగా అందించడమే కాకుండా పలు కీలక పదవులను మహిళలకు కట్టబెట్టి మహిళల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
మహిళల ఓట్లు గంపగుత్తుగా ముఖ్యమంత్రి జగన్ కి పడే అవకాశం ఉందని, ఆ ఓట్లకు గండి కొట్టాలని టీడీపీ కుట్రలకు దారి తీసింది. అందుకోసం కొన్ని పథకాలు రచించింది. దీనిలో భాగంగా వుయ్ యాప్ ని రూపొందించి అందులో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్ల అన్ని వివరాలను అందులో పొందుపరిచారు. మహిళల ఫోటోలు,అడ్రెస్ లతో సహా అన్ని వివరాలతో కూడిన జాబితా వుయ్ యాప్ లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితా ఇప్పుడు టీడీపీ నాయకుల చేతిలో ఉండడంతో మహిళల భద్రతకు ముప్పు ఏర్పడినట్లైంది.
రాష్ట్రంలో ఉన్న దాదాపు అందరి మహిళ ఓటర్ల వివరాలు టీడీపీ చేతిలో ఉండడం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. మహిళల గోప్యతకు ఇది ముప్పని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు, రౌడీలు ఆ వివరాలను చేజిక్కించుకుని మహిళలను వేధించే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళలను వేధించిన కాల్ మనీ లాంటి కేసుల్లో టీడీపీ నేతలే నిందితులుగా ఉన్నారు.. ఈ నేపథ్యంలో టీడీపీ రూపొందించిన వుయ్ యాప్ విషయంలో పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వుయ్ యాప్ విషయంలో ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.