ఎన్నికల ప్రచారం ఆఖరి రోజున టీడీపీ, జనసేన పార్టీ సభ్యులకి గట్టి షాకే తగిలింది. పవన్ కళ్యాణ్ బీజెపీని ఓప్పించి టీడీపీతో బలవంతపు కాపురానికి దారులు వేసినా. బీజేపీ అయిష్టతతో ఆ కాపురం మాత్రం సజావుగా సగడం లేదు. కూటమిలో ఉన్నాం అంటే ఉన్నాం అనిపించుకుంటున్నారే తప్ప బీజేపీ ఎక్కడా ఎన్నికల్లో సీరియస్ గా ఫోకస్ పెట్టిన సందర్భాలు కనపడలేదు. కూటమి పేరున చంద్రబాబు మానిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో కూడా బీజేపీ పెద్దలు ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. మరికొంతమంది బీజేపీ నాయకులు సైతం చంద్రబాబు అలవికాని హామీలు నెరవేర్చడం కష్టమని కాబట్టే ఆ మానిఫెస్టోతో తమకి సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా ఇదే బీజేపీ మరోసారి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చారు. నిన్నటి వరకి ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన నేడు ఏలూరు జిల్లా భీమవరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని షెడ్యూల్ కూడా విడుదల చేశారు అయితే అమిత్ షా మాత్రం నేడు ఏపీలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరుపున ఆయన మొక్కుబడిగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారంలో సైతం అమిత్ షా మార్క్ ఎక్కడా కనిపించలేదు, ఆయన ప్రసంగం కూడా పేలవంగానే సాగింది.
తెలంగాణలోని వికారాబాద్, వనపర్తిలో షెడ్యూల్ ప్రకారం సాగుతున్న అమిత్ షా ప్రచారం, ఏపీలో ఏలూరు జిల్లా భీమవరంలో జరగాల్సిన ప్రచారం రద్దు కావడంతో టీడీపీ , జనసేన శ్రేణులు డీలా పడిపోయాయి. ఏపీలో జగన్ హవా కొనసాగుతునట్టు ఇప్పటికే సర్వేలు స్పష్టం చేస్తున్న నేపధ్యంలో ఎలాగో గెలిచే స్థానం కాదు కబట్టే ఏపీలో ఆయన పెద్దగా ఫోకస్ పెట్టడంలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఏపీలో వెచ్చించే సమయాన్నే మరో రాష్ట్రంలో పెడితే మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చని, ఏపీలో ఎంత శ్రమించినా చిల్లు పడ్డ కుండలో నీళ్ళు పోసినట్టేనని ఆయన ఒక అంచనాకి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన ఉంది. దీనికి కూటమి నుండి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.