మెగా కుటుంబంలో పైకి ఏ కలహాలు లేనట్లుగా కనిపిస్తున్నా లోలోపల అటు అల్లు కుంటుంబానికి ఇటు చిరంజీవి కుటుంబానికి కలహాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. వీళ్ల మధ్య విభేదాలు గతంలో సోషల్ మీడియా వేదికగా గతంలో రచ్చకెక్కడం చూసాం. ఈ సారి కొత్తగా ఎన్నికల వేల స్నేహితుడు కోసం బన్నీ తీసుకున్న నిర్ణయం మరో కొత్త వివాదాన్ని సృష్టించినట్టు తెలుస్తుంది
2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ స్నేహితుడు కోసం నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చిచాడు, ఇంకోపక్క పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు సోషల్ మీడియాలో మద్దతు ఇచ్చాడే కానీ స్వయంగా వెళ్లి ప్రచారం చేయకపోవడం ఈ మనస్ఫర్థాలకు కారణంగా తెలుస్తుంది దీనిపై చిరంజీవి తమ్ముడు నాగబాబు సోషల్ మీడియా ట్వీట్టర్ వేదికగా ఘాటుగా స్పందించాడు “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..”అని ఆ ట్వీట్ లో ఉంది.
నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసిన రవిచంద్ర కిషోర్ రెడ్డి తన స్నేహితుడు కాబట్టి మద్దతిచ్చానని, తాను రాజకీయాలకు దూరమని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని అల్లు అర్జున్ స్పష్టతనిచ్చినా కూడా నాగబాబు అలా స్పందించడం పట్ల బన్నీ అభిమానులు ఫైర్ అయ్యారు,మెగా అభిమానులు అందరూ విడిపోయి ఒకరిమీద ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో ఈ దాడిని తట్టుకోలేక నాగబాబు తన ట్విట్టర్ ఖాతను తాత్కలికంగా మూసువేసినట్టు తెలుస్తుంది
ఎన్నికలకు ముందు నాగబాబు ట్వీట్ చేసినా బాగుండేది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా చేయడం మంచి పద్దతి కాదని సోషల్ మీడియా లో మెజారిటీ వీక్షకులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు