వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుండి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన షర్మిలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ముందునుండి ఊహాగానాలున్నాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయింది. వైయస్ […]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో 8వ తేదీన డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆస్పత్రి […]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు (కేసీఆర్)ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఆయన ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రిలో 8వ తేదీన డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపి తెలంగాణా మంత్రులకు శాఖలను కేటాయించారు. . కీలకమైన హోంశాఖతో పాటు మంత్రులకు […]
పారిశ్రామిక అభివృద్ది అనేది కాలంతో పాటు సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కో అధ్యాయంలో మారుతున్న కాలాన్ని బట్టి పారిశ్రామికంగా మరింత ముందు అడుగువేయడానికి కొత్త పాలసీలు సృష్టించబడుతాయి. ఆ విధానాలు సమాజంపై సత్ఫలితాలు వచ్చినా దుష్ఫలితాలు వచ్చినా ఆ పాలసీలు తయారు చేసిన వాళ్ళు మాత్రమే భాద్యులౌతారు.. ఇది ప్రాధమిక సూత్రం. కానీ మాన రాష్ట్రంలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి మనం దశాబ్ధాలుగా వింటూనే వస్తున్నాం. అదేమిటంటే రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగినా అందుకు […]
ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని సీనియర్ నాయకులను సంతృప్తి పరుస్తూ తెలంగాణ నూతన ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. తెలంగాణాలో ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని […]