తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల నటించిన చిత్రం లవ్ గురు. వినాయకన్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రంలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. విజయ్ ఆంటోని నటించిన మొదటి రొమాంటిక్ డ్రామా ఇదే కావడం విశేషం. కాగా ఈ చిత్రానికి భరత్ ధనశేఖర్, రవి రోయ్స్టర్ సంగీతం అందించారు. వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలలో నటించిన లవ్ గురు మిశ్రమ స్పందనలకే పరిమితం అయింది.
తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. మే 10 నుండి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా రెండు ఓటీటీల వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం. ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వేదికగా లవ్ గురు స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. భార్యను ప్రేమించే భర్తగా విజయ్ ఆంటోని నటన ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని తప్పకుండ తమ సినిమాను ఓటీటీలో విజయవంతం అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ప్రేక్షకులను ఎంతమేర అలరించనుందో మే 10న తెలిసిపోతుంది.