ఏపీ, తెలంగాణల్లో తదుపరి ఎలెక్షన్లు ఒకేసారి జరగనుండటంతో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల లిస్టును క్షుణ్నంగా వడకట్టనుంది. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య -7.88 లక్షలు కాగా,వంద ఏళ్లు దాటిన వృద్ధులు -1174 మంది ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరడంతో… ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలని. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలని (పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). ఎలక్షన్ కమిషన్ వారు నిర్దేశించారు.
ఎవరికైనా రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కేసు నమోదవుతుంది అని తెలిపారు. శాసన సభ ఎలక్షన్లలో తెలంగాణలో ఓటు వేసినవారు, ఏ.పీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన ఋజువులు ఉండటంతో ఎలక్షన్ కమీషనర్ ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. “తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం” అని వివరించారు. నాగబాబులా తెలంగాణలోనూ, ఏపీలోనూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికిది ఇబ్బందికర వార్తే!!!