2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మహాసేన అధ్యక్షుడు రాజేష్మాట్లాడుతూ జనసేన పోటీ చేయబోయే అన్ని నియోజక వర్గాలలో జనసేన ఓటమికి కృషి చేస్తామని తెలిపారు. మహాసేన మీడియా ద్వారా ఈ విధంగా ప్రకటించాడు, పవన్ కళ్యాణ్ కు, జనసేనకు మా మద్దతు ఉపసంహరించుకుంటున్నం.. పవన్ కళ్యాణ్ తో పోలిస్తే మా వర్గాలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సరైన గౌరవం అందించారు అని అన్నాడు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు బెటర్ అంటూ రాసుకుంటూ వచ్చాడు.
కులం, మతం పేరుతో అమాయకులపై దాడి చేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. మా వర్గాల ప్రజలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్న పవన్ కళ్యాణ్ కి రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తాం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ వల్ల జరిగే అనార్థాలను ప్రజలకు తెలియజేస్తాం, ఇప్పటివరకు చాలా సహించామన్నారు. జనసేన పార్టీ పోటీ చేయబోయే అన్ని నియోజకవర్గాలలో ఆ పార్టీని ఓడించడానికి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం అని తెలిపారు. మాకు రాజకీయాలు, పదవులు ముఖ్యం కాదు, వివక్షకి గురవుతున్న మా వర్గ ప్రజల తరఫున పోరాడడమే మాకు ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. అధినాయకత్వంలో నిలకడ లేనప్పుడు మేము కూడా నిలకడగా ఉండలేమని అన్నారు. కాగా మహాసేన రాజేష్ కి టిడిపి తరఫున టికెట్ కేటాయించినట్లే కేటాయించి సీట్ ను వెనక్కి లాక్కున్న విషయం తెలిసిందే .