ఐపీఎల్ 2024 లో నేడు ముంబాయి వాఖండే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబాయి ఇండియన్స్ తలపడనుంది . ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లలో ఇప్పటివరకూ ముంబాయిదే పై చేయి , ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్‌లు జరిగగా ఇందులో ముంబై 23 మ్యాచ్‌లు, కోల్‌కతా 9 మ్యాచ్‌లు గెలిచాయి.
అయితే, గత ఐదు మ్యాచ్‌లు చూస్తే కోల్‌కతాదే పైచేయి. 5 మ్యాచ్‌ల్లో కోల్‌కతా 3 మ్యాచ్‌లు గెలుపొందగా, ముంబై 2 గెలిచింది. వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగగా, కోల్‌కతా ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించగా, ముంబై 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఈ సీజన్ లో ముంబై జట్టు 10లో మూడు విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా కోల్‌కతా జట్టు 9లో ఆరు విజయాలతో రెండో స్థానంలో ఉంది., రెండు జట్లు బలాబలాలు చూస్తే కోల్‌కతా జట్టు ముంబాయి కంటే పటిష్టంగా కనిపిస్తుంది
ముంబై ఇండియన్స్ :
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ , మహ్మద్ నబీ, నేహాల్ వధేరా
కోల్‌కతా నైట్ రైడర్స్ :
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్) , ఫిల్ఫ్ సాల్ట్, సునీల్ నరైన్ , వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి