నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో ఉద్రిక్తతత చోటు చేసుకుంది. తెలుగుదేశంలోని రెండు వర్గాల మద్య ఘర్షణ నెలకొంది. మాజీ శాసన సభ్యులు కొమ్మి లక్ష్మయ్యపై కేశవ చౌదరి వర్గం దాడికి దిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా భారీ ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో అక్కడే ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా కింద పడిపోయారు. కేశవ చౌదరి ఇంటికి వస్తానని చెప్పి రాకుండా ఆనం, మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య నాయుడు ఇద్దరు నేరుగా రవీంద్ర నాయుడు ఇంటికి వెళ్లడంతో గొడవ మొదలైందని అక్కడి వారు చెబుతున్న మాట.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పటికే దారుణంగా తయారైంది. గత ఎన్నికల్లో మాదిరి ఇప్పుడు కూడా కనీసం ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకుల నుండి వస్తున్న మాట. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు కావడం, నారా లోకేష్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలు కావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులని, నాయకులని ఈ ఎన్నికలు టెన్షన్ పెడుతున్న నేపథ్యంలో ఇలా తెలుగుతమ్ముళ్ళు మాత్రం సమన్వయం కోల్పోయి ఇలా రోడ్డున పడి తన్నుకోవడం చూస్తే చంద్రబాబు తెలుగుదేశం శ్రేణులని ముందుండి ఎన్నికల రణక్షేత్రానికి నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.