తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపి తెలంగాణా మంత్రులకు శాఖలను కేటాయించారు. . కీలకమైన హోంశాఖతో పాటు మంత్రులకు కేటాయించని పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, విద్య వంటి ఇతర శాఖలను రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకోవడం గమనార్హం.
మంత్రుల శాఖల వివరాలివే..
రేవంత్ రెడ్డి – హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం
భట్టి విక్రమార్క – ఆర్థిక, ఇంధన శాఖ
తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయం, చేనేత
ఉత్తమ్ కుమార్ రెడ్డి – నీటి పారుదల, పౌరసరఫరాలు
జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్, పర్యాటకం
దామోదర రాజనర్సింహ – వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
సీతక్క – పంచాయతీ రాజ్, మహిళ, శిశు సంక్షేమం
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహరాలు
కొండాసురేఖ – అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ