కొందరు స్టూడెంట్స్ సంవత్సరమంతా ఆడుతూ పాడుతూ గడిపేసి ఉంటారు. ఎగ్జామ్స్ వచ్చాక హడావుడిగా పుస్తకాలు తెరిచి చదివేస్తారు. తీరా క్వచ్ఛన్ పేపర్ చూశాక తెల్లమొహం వేసి ఆన్సర్ షీట్లో సినిమా కథలు రాసేస్తుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అంతే. 2019లో ఓడిపోయాక సినిమాలు చేసుకుంటూ ఫాం హౌస్‌లో జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలకు సినిమా కథలు చెబుతున్నాడు. కానీ అవి జానీ, సర్దార్ గబ్బర్ సింగ్‌ల స్థాయివి కావడంతో జనం నవ్వుకుంటున్నారు.
‘వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మేము పారిపోతామన్నారు. ఐదేళ్లు అయిపోయాయి. ఇక్కడే ఉన్నాం. ప్రజల కోసం పోరాడాం. చొక్కాలు పట్టుకుని నిలదీశాం. తెలుగు ప్రజలకు అండగా ఉన్నాం’ నెల్లూరులో శుక్రవారం జరిగిన ఉమ్మడి సభలో పవన్ వ్యాఖ్యలివి. ఈయన ఏం చెప్పినా సైకో సేన నమ్మేస్తుంది. జనం కూడా అంతే అనుకున్నాడు కాబోలు. నోటికొచ్చిన కథ చెప్పేశాడు.
జనాన్ని మోసం చేయడంలో ధనసేనాని చంద్రబాబును మించి పోతున్నాడు. టీడీపీకి అవసరమైన సందర్భాల్లో మాత్రమే వాలిపోయి వైఎస్సార్సీపీని తిట్టేవాడు. ప్రజలకు అండగా ఉన్నామని మాటైతే అనేశాడు. కానీ ఈ ఐదేళ్లలో పవన్ ఏపీకి వచ్చింది చాలా తక్కువ సందర్భాల్లోనే.. కరోనా మహమ్మారి సమయంలో దత్తతండ్రి, దత్తపుత్రుడు హైదరాబాద్ దాటి రాలేదు. కానీ ఇప్పుడు వీరి మాటలు కోటలు దాటుతున్నాయి. చాలా పోరాటాలు చేశామని గొప్పగా చెప్పుకొన్నాడు. అసలు జగన్ బాగా పరిపాలిస్తే సినిమాలు చేసుకుంటానని గతంలో ప్రకటించిన విషయాన్ని మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రస్తుతం వరుసపెట్టి మూవీస్ చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్రెడ్డి పాలన బాగునట్టే. ఏమంటావు పవనూ..
పవన్ ఈ ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని, మంత్రులు, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా తిట్టడం తప్ప ఏమీ చేయలేదు. వీకెండ్ పొలిటీషియన్ అవతారమెత్తింది వాస్తవం. ఎల్లో స్క్రిప్ట్‌ను ఊగుతూ చదివి వెళ్లిపోయి షూటింగ్‌ల్లో పాల్గొనేవాడు. నాలుగు రోజులు ఊరూరు తిరిగిస్తే జనానికి అండగా ఉన్నట్లు కాదు అజ్ఞాతవాసీ.