తనను శోభన్ బాబుతో పోల్చిన వ్యక్తినే మర్చిపోయిన చంద్రబాబు!
గత కొంతకాలంగా అనేక సభల్లో ఒకదానికొక దానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు జ్ఞాపకశక్తి ఈరోజు వ్యక్తులని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఒక దశలో ఆయన మాటలు పరిధి దాటుతున్నాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబుకు బుద్ధి మందగిస్తుంది కావచ్చు. గత కొంతకాలంగా అనేక సభల్లో ఒకదానికొక దానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు జ్ఞాపకశక్తి ఈరోజు వ్యక్తులని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఒక దశలో ఆయన మాటలు పరిధి దాటుతున్నాయి. మానవత్వాన్ని మరిచి శృతిమించుతున్నాయి. ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు మాటలు అయితే మతిస్థిమితం లేని మనిషిలా ఉన్నాయి.
ఇవన్నీ కాసేపు పక్కన పెడితే… కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రచార సభలో చంద్రబాబు బిజెపి నేతకి షాకిచ్చాడు. అనకాపల్లిలో నిర్వహించిన మోడీ సభలో మాట్లాడుతూ బిజెపి నేత విష్ణుకుమార్ రాజు పేరును ఒకటికి రెండుసార్లు మర్చిపోయాడు. కూటమి పార్టీలతో పొత్తులో ఉంటూ ఆ పార్టీలు నేతలు పేర్లు గుర్తు పెట్టుకో లేకపోతే కూటంతో చంద్రబాబు రాజకీయాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడు అనేది ప్రశ్నార్థకమే… పైగా కూటమిలోకి బిజెపిని ఒప్పించడం కోసం పడడానికి పాట్లు పడిన చంద్రబాబు కూటమి నేతలని మర్చిపోవడం బిజెపి నేతలను ఒకింత అసహనానికి గురి చేసింది. అయితే ఐదేళ్ల క్రితం చంద్రబాబును అదే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు శోభన్ బాబు లా ఉంటాడని పొగడటం గమనార్హం.