ఐపీఎల్ లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది , అఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీనే పై చేయి సాధించింది . మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ చేసి ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది, ఢిల్లీ ఓపెనర్లు మెక్‌గర్క్, అభిషేఖ్ పోరెల్ లు మెరుపు బ్యాటింగ్‌తో అర్థ సెంచరీలు సాధించారు ..చివర్లో స్టబ్స్ కూడా మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయగలిగింది పోరెల్ 65 పరుగుల, జేక్ ఫ్రెసర్ 50 పరుగులు, స్టబ్స్ 41 పరుగులతో రాణించారు.
222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది, రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే పోరాడాడు సంజు శాంసన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 86 పరుగులు చేయగా, రియాన్ పరాగ్ 27, దూబే 25 పరుగులతో పర్వాలేదనిపించారు మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమవడంతో రాజస్థాన్ కి ఓటమి తప్పలేదు.దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది
ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కుల్దీప్ యాదవ్ ఎంపిక అయ్యాడు