దర్శి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా గొట్టిపాటి నరసయ్య కూతురు గొట్టిపాటి లక్ష్మీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. తనకు టికెట్ కేటాయించిన తరువాత సొంత నియోజకవర్గం అద్దంకి నుండి తన అన్న గొట్టిపాటి రవి అండ దండలతో సొంత అభిమానుల మధ్య దర్శిలో అడుగుపెట్టిన గొట్టిపాటి లక్ష్మీకి ఘన స్వాగతం పలికారు. ఆరోజు జరిగిన స్వాగత సత్కారాలు, కార్యక్రమాలు చూసిన దర్శి టీడీపీ నాయకులు ఆశ్చర్యపొయ్యారు. గొట్టిపాటి లక్ష్మీ నరసరవుపేటలో గైనకాలజిస్టుగా పని చేస్తూ తన అన్న […]
ఉదయగిరి టీడీపీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా కేవలం వందల కోట్లు ఖర్చు చేస్తారు అని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే కాకర్ల సురేష్ ఒంటెద్దు పోకడలతో ఉదయగిరి సీనియర్ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకర్ల దురుసు ప్రవర్తనకు నొచ్చుకొని ప్రచారానికి దూరంగా మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు కంభం విజయరామి రెడ్డి అందరూ కలిసి కట్టుగా దూరంగా ఉన్నారు. […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పరిధిలో రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ దళితుల మీద దాడి చేసి గాయపరిచిన సంఘటలు చూసాము. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం,రంగాపురం గ్రామంలో ప్రచారానికి వచ్చిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పై టీడీపీ, జనసేన నాయకులు దాడి చేసి సునీల్ కు చెందిన రెండు కార్లను ధ్వంసం చేశారు. దీని మీద సునీల్ ఇప్పటికే […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈవీఎంలు ఇంకా పోలింగ్ కేంద్రాలకు చేరలేదు. అప్పుడే కూటమి అభ్యర్థులదే గెలుపంటూ కట్టు కథలు వండి వారుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇలా చేయకూడదు. కానీ రామోజీ పత్రికకు అవేమీ పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే తన సామాజికవర్గం అడ్డగోలుగా దోచుకోవచ్చని భావిస్తోంది. రోజూ జిల్లా […]
ఏపీలో ఎండలతో పాటు ఎలక్షన్ హీట్ కూడా పెరిగింది, ప్రత్యర్ధి పార్టీలు ఒకరి మీద ఒకరు సవాళ్లతో, రెచ్చ గొట్టే ధోరణితో ఎక్కడిక్కడ అలజడులు రేగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం విరవ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ప్రచారానికి వచ్చిన సమయంలో జనసేన, టీడీపీ కి చెందిన యువత వారు పార్టీ జెండాలను చూపుతూ వారి పార్టీ స్లోగన్ లు ఇస్తూ రెచ్చగొట్టారు. కానీ వంగా గీత తమ పార్టీ కార్యకర్తలను ,నాయకులను […]
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఏపీ సిఐడికి తెలుగుదేశం పార్టీ వారి పైన చర్యలు తీసుకోమని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సిఐడి వారు దుష్ప్రచారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ , ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో రాజకీయా ఎత్తుగడలతో రోజు రోజుకి మారిపోతూ మంచి రంజుగా మారాయి. వైసీపీ నుండి వేమిరెడ్డి , అతని భార్య ప్రశాంతి టీడీపీలో జాయిన్ అయ్యారు. ప్రశాంతి కోవూరులో టీడీపీ తరపున పోటిలో నిలబడ్డారు. మొదట నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమ్ముడిని మూడు కోట్లు ఇస్తామని, టీడీపీలోకి రమ్మని అన్నదమ్ములను విడదీయడానికి మాట్లాడిన కాల్ రికార్డింగ్ హల్చల్ చేసింది. అంతే కాకుండా ప్రతి నాయకుడికి , కార్యకర్తకు రేటు కట్టి డబ్బులు విచ్చలవిడిగా […]
టీడీపీ పార్టీలోనే అత్యంత వివాదాస్పద నాయకుడు బోండా ఉమ. ఎన్నికల నేపథ్యంలో తను ప్రవర్తిస్తున్న తీరుతో నవ్వులపాలు అవుతున్నారు. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది బోండా ఉమ తీరు. తను అప్పుడే గెలిచినట్టు మంత్రిని అయినట్టు ప్రవర్తిస్తూ ఓ నలుగురికి వాకిటాకీలిచ్చి తను చూట్టూ పెట్టుకున్నాడు. ఎవరైనా పార్టీ నాయకుడు గానీ కార్యకర్త గానీ బోండా ఉమను కలవాలంటే అడ్డుకొని వాకీటాకీ లో పై రూం లో వుండే బోండా ఉమ […]
కూటమిలో లుకలుకలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనానికి పిలిచి టీడీపీ కార్యకర్త సన్నాసిరావుని రూమ్ లో బంధించి యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పిఏ, డ్రైవర్ కలిసి చెక్కలతో కుర్చీలతో చితకబాదారు. దీనితో సన్నాసిరావు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న అచ్యుతాపురం ఎస్ కె ఆర్ ఫంక్షన్ హాల్లో యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం […]