ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీచిందని, జగన్ పిలుపు మేరకు అన్ని ప్రాంతల ప్రజలు భారీ స్థాయిలో పోలింగ్ లో పాల్గొని తిరిగి వైసీపీకి పట్టం కట్టేందుకు ఓటు వేశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ ముందు నుండి చెబుతునట్టుగానే తన ప్రమాణ స్వీకారాన్ని విశాఖనుండే చేయబోతునారని , దీనికి సంబంధించిన తేదీని వివరాలను రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే కార్యక్రమం జరుగుతుందని ఆయన విలేఖరుల సమావేశంలో చెప్పారు.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఎన్నో కుట్రలు కుతంత్రాలకు పాల్పడిందని ఆఖరికి ప్రజకు అందాల్సిన సంక్షేమ పథకాలను సైతం అడ్డుకునే కుట్రలు చేసిందని దీంతో ప్రజలు తమకు మళ్ళీ జగన్ సంక్షేమ ప్రభుత్వమే కావాలని బలంగా కోరుకున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం మహిళల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనం అని ఆయన తన అభిప్రాయన్ని పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతీ వైసీపీ కార్యకర్తకు ధన్యవాదాలని, ఎన్నికలు సజావుగా సాగేందుకు వీరు చేసిన కృషికి వెలకట్టలేమని ఆయన అభిప్రాయపడ్డారు.