ఉదయగిరి టీడీపీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా కేవలం వందల కోట్లు ఖర్చు చేస్తారు అని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అయితే కాకర్ల సురేష్ ఒంటెద్దు పోకడలతో ఉదయగిరి సీనియర్ టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. కాకర్ల దురుసు ప్రవర్తనకు నొచ్చుకొని ప్రచారానికి దూరంగా మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని వెంకట రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకుడు కంభం విజయరామి రెడ్డి అందరూ కలిసి కట్టుగా దూరంగా ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న ఉదయగిరి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ కాకర్ల సురేష్ వ్యవహార శైలిపై జిల్లా నాయకులకు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యేల బృందం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి కాకర్ల సురేష్ మమ్మల్నీ కనీసం ప్రచారానికి పిలవడం లేదు మేము ఏమీ చెయ్యాలి మాకు కనీస గౌరవం లేనప్పుడు మేము ఎలా వస్తాము అంటూ వాపోయారు. అంతే కాకుండా కాకర్ల నామినేషన్ ముందు రోజు ఐదుగురు మాజీ ఎమ్మేల్యందరం కలిసి కాకర్లకు అండగా నిలబడతామని కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని అధినేత చంద్రబాబునాయుడుకు తెలిపాము. అయితే నామినేషన్ కు మాకు కనీస సమాచారం ఇవ్వలేదు ఆ నామినేషన్ కు మమ్మల్ని పిలవలేదు ,చివరకు మా మండలాలకు, గ్రామాలకు వచ్చి మాకు సమాచారం ఇవ్వలేదు అంటే మేము ఏ విధంగా చూడాలి అంటూ తమ గోడును కార్యకర్తలతో వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బొల్లినేని, మేకపాటి చంద్రశేఖర్ , విజయరామిరెడ్డి పాల్గొన్నారు వీరితో ఎనిమిది మండలాలకు చెందిన కీలక టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరు అయ్యారు.
ఇదే సమయంలో వైసీపీ వర్గ విభేదాలు పక్కన పెట్టీ కీలక నాయకులు కార్యకర్తలు ఏక తాటిపై వచ్చి ప్రచారంలో దూసుకుపోతుంటే, టీడీపీ మాత్రం వందలకోట్లు ఖర్చు చేస్తాడు అనే పేరుతో కాకర్ల సురేష్ కు టికెట్ ఇవ్వగా తన పోకడలతో తనే ఒక సుప్రీంలా వ్వవహరిస్తూ పార్టీ నాయకులను దూరం చేసుకుంటూ గెలుపు అవకాశాలను సన్నగిల్లేలా వ్యవహరిస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.