ఎన్నికల మాటున టీడీపీ చేసిన మరో కుట్ర బయటపడింది. సర్వే పేరిట హైదరాబాద్కేంద్రంగా మైనర్లతో వెట్టిచాకీరి చేయించుకున్నట్టు బాధితుల ఆందోళనతో బహిర్గతమైంది. వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇన్విక్టస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద అలాగే కుకట్ పల్లీలో బీపీఓ కంపెనీ ఓపెన్ చేసి కొంతమంది మైనర్లను రిక్యూట్ చేసుకుని వారికి నెలకి 13వేలు జీతం ఇస్తామని చెప్పి బీపీవో ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు.
ఇదిలా ఉంటే ఎన్నికల అనంతరం వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు. 13 వేలు ఇస్తామని చెప్పి చివరికి 3 వేలే ఇచ్చి మోసం చేశారని కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇందులో కొంతమంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం. అయితే యువత ఆందోళన చేపట్టినా యాజమాన్యం నుండి సైరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం చెందిన యువకులు నాగార్జున సర్కిల్ వద్ద ఉన్న ఆఫీసుపై దాడికి దిగారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి పోలీసులు చేరుకోవడంతో టీడీపీ కుట్ర బయటపడింది. మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టగా ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు .