ఐపీఎల్ 2024 నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అక్షర్ పటేల్ కెప్టెన్సీ భాధ్యతలు చేపట్టాడు,
ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ ఎప్పటిలానే దూకుడుగా ఆయన ప్రారంభించాడు కానీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు, 27 పరుగులు చేసి వెనుదిరిగాడు, తరువాత వచ్చిన బ్యాటర్లు రజత్ పాటిదార్ , విల్ జాక్స్ లు ఆర్సీబీ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు, రజత్ పాటిదార్ 32 బంతుల్లో 52 పరుగులు, విల్ జాక్వెస్ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు.
వీళ్లిద్జరూ ఉండగా ఒకదశలో 10 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి భారీ స్కోర్ చేస్తుందనే తరుణంలో ఢిల్లీ బౌలర్లు పుంజుకున్నారు, లాస్ట్ 10 ఓవర్లలో కేవలం 77 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు పడగొట్టారు, దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది
అనంతరం 188 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ
టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. 4 ఓవర్లలో 4 వికెట్లు పడిపోయాయి..మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
తాత్కాలిక కెప్టెన్ అక్షర్ పటేల్ అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ పరువు కాపాడాడు. షాయ్ హోప్‌తో కలిసి ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హోప్ 23 బంతుల్లో 29 పరుగులు, అక్షర్ పటేల్ 39 బంతుల్లో 57 పరుగులు చేశారు.కానీ విజయాన్ని అందుకోలేకపోయారు, ఢిల్లీ క్యాపిటల్స్ 140 పరుగులకే ఆలౌటై ఓటమిని మూటకట్టుకుంది
యాష్ దయాల్ 3 వికెట్లు , ఫెర్గుసన్ 2 వికెట్లు , స్వప్నిల్ , సిరాజ్ , గ్రీన్ చెరో వికెట్ తీసారు, అటు బ్యాటింగ్ మరియు బౌలింగ్ లో రాణించిన గ్రీన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది
ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది.
తర్వాత ఆడబోయే మ్యాచ్ లో ఆర్సీబీ చెన్నైపై గెలవాల్సి ఉంటుంది.నెట్ రన్ రేట్ కూడా కీలకం కానుంది