ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలీగల్ సెల్ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ ఏపీ సిఐడికి తెలుగుదేశం పార్టీ వారి పైన చర్యలు తీసుకోమని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సిఐడి వారు దుష్ప్రచారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ , ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన సిఐడి వారు విచారణ నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. నోటీసులను టిడిపి ప్రధాన కార్యాలయ ఇంచార్జ్ అశోక్ బాబుకి నోటీసులు అందించి రేపు విచారణకు రమ్మని కోరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా లాక్కుంటారని చేస్తున్న దుష్ప్రచారం పైన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన ఎన్నికల కమిషన్ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఐవిఆర్ఎస్ కాల్స్ చేస్తున్న సంస్థల పైన కేసు నమోదు చేయాలని ఏపీ సిఐడికి కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో గత కొద్ది రోజులుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది.