విశాఖ కంచరపాలెం, బర్మా క్యాంపు ప్రాంతంలో జరిగిన గొడవకు సంబంధించి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం సత్యదూరమని తేలిపోయింది. విశాఖలో జరిగింది కేవలం కుటుంబాల మధ్య గొడవని, వీరికీ రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని ఇంతకు ముందు కూడా ఈ ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయని వీరికి రాజకీయాలు ముడిపెట్టి అసత్య ప్రచారలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ మోకా సత్తిబాబు మీడియా ముఖంగా హెచ్చరించారు.
విశాఖ నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడిచేశారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా చేసిన ప్రచారం తెలిసిందే. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని తెల్సినా చంద్రబాబు అధికార పార్టీపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని ఇలా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పలువురు చెబుతున్న మాట.