కూటమిలో లుకలుకలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి. యలమంచిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనానికి పిలిచి టీడీపీ కార్యకర్త సన్నాసిరావుని రూమ్ లో బంధించి యలమంచిలి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ పిఏ, డ్రైవర్ కలిసి చెక్కలతో కుర్చీలతో చితకబాదారు. దీనితో సన్నాసిరావు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
నిన్న అచ్యుతాపురం ఎస్ కె ఆర్ ఫంక్షన్ హాల్లో యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.దీనికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు. మీటింగు జరిగిన తరువాత బోజనాల దగ్గర టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య మాటా మాటా వచ్చి జనసేన కార్యకర్తలను జెండా కూలీలు అని టీడీపీ వారు అనడంతో సుందరపు విజయ్ కుమార్ , పిఏ, డ్రైవర్లు టీడీపీ కార్యకర్త సన్నాసి రావును కిచెన్ లోకి తీసుకువెళ్ళి కుర్చిలతో , కర్రలతో చితకబాదేసరికి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. దానితో భయపడిపోయిన సుందరపు విజయ్ మనుషులు కిచెన్ కు తాళం వేసి పారిపోయారు.
తర్వాత అక్కడినుండి బయటపడిన సన్నాసి రావు జరిగిన సంఘటన మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ నాయకులు కార్యకర్తలు యలమంచిలి సీటు జనసేన కు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ సంఘటనతో సుందరపు విజయ్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాము అని ప్రకటించి ఓట్లు కోసం తమ ఏరియా లో అడుగు పెడితే ఒప్పకోము అని ఖరాఖండిగా చెప్పడంతో టీడీపీ అగ్రనేతలకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు అలాగే చేసిన సంఘటన మీద సుందరపు విజయ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడంతో టీడీపీ కార్యకర్తలు భగ్గు మంటున్నారు.
వరుసగా జరుగుతున్న పరిణామాలు గొడవలు చూసి కూటమి పుట్టి మునగడం ఖాయం, సుందారపు విజయ్ పోటిలో గెలవకముందే ఇలా రౌడీయిజం చేస్తుంటే గెలిస్తే సామాన్యులను బతకనీయడు అని నియోజకవర్గ ప్రజలు భయ పడుతున్నారని జనసేన ముఖ్య నాయకులు గగ్గోలు పెడుతున్నారు.