ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు ఎంపీ పరిధిలో రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దెందులూరులో టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ దళితుల మీద దాడి చేసి గాయపరిచిన సంఘటలు చూసాము. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం,రంగాపురం గ్రామంలో ప్రచారానికి వచ్చిన వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ పై టీడీపీ, జనసేన నాయకులు దాడి చేసి సునీల్ కు చెందిన రెండు కార్లను ధ్వంసం చేశారు. దీని మీద సునీల్ ఇప్పటికే ఎస్పీ కి ఫిర్యాదు చేసి దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు ఎంపీ నియోజకవర్గంలో ప్రచారం ముగింపుకు వస్తుండే సరికి టీడీపీ గ్రాఫ్ పడిపోతూ ఓటమి తప్పదని అర్ధం అయిన టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
ఏలూరు ఎంపీ స్థానంలో జరిగిన పరిశీలిస్తే గత వారం దెందులూరులో వరుసగా పెదవేగి మండలంలో తమకు ఎదురు మాట్లాడారనే కారణంతో దళితులు, సామాన్యుల మీద దాడి చేసి ఏడుగురిని గాయపరిచారు. ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన కలిసిన ప్రజల్లో స్పందన లేదుని వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తూ చులకన అయ్యారు. కైకలూరులో ఇప్పటికే టీడీపీ ఖాళీ అయింది. అక్కడ కనీస పోటి ఇచ్చే స్థాయిలో కూటమి అభ్యర్థి లేరు. నూజివీడులో టీడీపీకి సొంత పార్టీ ఇంటి పోరు తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ టీడీపీకి మొదటి నుండి అండగా నిలబడిన బీసీ సామాజిక వర్గం దాదాపు దూరం అయినట్టే. పోలవరంలో జనసేనకు టికెట్ కేటాయించాడంతో బాబు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక్కడ బాబు సామాజిక వర్గం అండతో టీడీపీ రెబల్ గా పోటిలో నిలిచింది. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు పోటిలో వున్న అభ్యర్థి నుంచి ప్రచారానికి విచ్చలవిడిగా డబ్బులు డిమాండ్ చేస్తుండే సరికి ఇప్పటికే చేతులు ఎత్తేశాడు. దెందులూరు నియోజకవర్గంలో జనసేనకు టికెట్ కేటాయించి టీడీపీ నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చే సరికి మొదటి నుండి జనసేన లో పనిచేసిన నాయకులు అందరూ ఇప్పటికే పార్టీకి దూరం జరిగి కీలక నాయకులు వైసీపీలో జాయిన్ అయ్యారు.
ఇలా ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జన సేన కూటమికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ సిద్ధం సభ దెందులూరులో నభూతో నభవిష్యత్ అనే రీతిలో ఆరు లక్షల మంది హాజరు అవ్వడం , వెంటనే జిల్లాలో జరిగిన బస్సు యాత్ర విజయవంతం అవ్వడంతో పాటు ఏలూరు సభ గ్రాండ్ హిట్ అవ్వడంతో తట్టుకోలేక టీడీపీ నేతలు వరుసగా వైసీపీ నాయకుల మీద దాడులు చేస్తు తమ ఓటమిని ముందే అంగీకరించారు అని ఏలూరు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.