ఏపీలో ఎండలతో పాటు ఎలక్షన్ హీట్ కూడా పెరిగింది, ప్రత్యర్ధి పార్టీలు ఒకరి మీద ఒకరు సవాళ్లతో, రెచ్చ గొట్టే ధోరణితో ఎక్కడిక్కడ అలజడులు రేగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురంమండలం విరవ గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ప్రచారానికి వచ్చిన సమయంలో జనసేన, టీడీపీ కి చెందిన యువత వారు పార్టీ జెండాలను చూపుతూ వారి పార్టీ స్లోగన్ లు ఇస్తూ రెచ్చగొట్టారు. కానీ వంగా గీత తమ పార్టీ కార్యకర్తలను ,నాయకులను సంయమనం పాటించాలని కోరారు అంతే కాకుండా ప్రతిగా నినాదాలు కూడా చెయ్యవద్దు అంటూ సూచించి గొడవలు జరగకుండా హుందాగా వ్యవహరించారు.
పిఠాపురంలో గత నెల రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సినిమా పరంగా అభిమానించే సినిమా నటులు , సిరియల్ నటులు అంతా పిఠాపురంలో తిష్ట వేసి రాష్ట్ర సీఎం, వైసీపీ అధినేత జగన్ ను వ్యక్తిగత విమర్శలతో మరి దిగజారి తిడుతున్నా ప్రతి గ్రామంలో వైసీపీ కార్యక్తలను రెచ్చగొడుతున్నా కానీ ఈరోజు వరకు వైసీపీ పార్టీ వైపు నుండి ఎటు వంటి ప్రతి చర్యలు లేకుండా కేవలం ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన సంక్షేమం, అభివృద్దినీ మాత్రమే ప్రచారం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ను కూడా విమర్శించకుండా ఓట్లు అడుగుతూ వస్తున్నారు.
పిఠాపురంలో ప్రతి మీటింగ్ లో పవన్ కళ్యాణ్, ప్రతి రోజు నాగబాబు మీ అంతూ చూస్తాము ఎవడు వస్తాడో రాండి కొడకల్లారా అంటూ జగన్ ను ఏక వచనంతో పిలుస్తూ కుటుంబాన్ని కూడా వదలకుండా తిడుతూనే వున్నారు, వీళ్లకు తోడు జబర్దస్త్,సీరియల్ నటులు తమ నోటికి ఎంత వస్తే అంతా మాటలు అంటూ రాజకీయ ప్రచారాన్ని నీచ స్ధాయికి దిగజార్చారు. అదే సమయంలో వంగా గీత చేసే ప్రచారం అలాగే కార్యకర్తలను సంయమనం పాటించాలని కోరుతూ నియోజకవర్గాన్ని ప్రశాంతతను కాపాడుతూ వస్తున్నారు.