ఐపీఎల్ 2024 లో భాగంగా చెన్నై చేపాక్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 141 పరుగులే చేసింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు , చెన్నై బౌలింగ్ దాటికి బ్యాటింగ్ లో రాణించలేకపోయారు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రియాన్ పరాగ్ ఒక్కడే 47 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ని అందించాడు
చెన్నై బౌలర్లు అధ్బుతమైన బౌలింగ్ తో రాజస్థాన్ రాయల్స్ ని కట్టడి చేసారు, సిమర్జీత్ సింగ్ 3 వికెట్లు , తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీసారు , మిగిలిన బౌలర్లు వికెట్లు తీయకపోయిన కట్టుదిట్ట బౌలింగ్ తో రాజస్థాన్ ను భారీస్కోర్ చేయకుండా కట్టడి చేసారు
అనంతరం లక్ష్య ఛేధనకు దిగిన చెన్నైకి ఓపెనర్లు దూకుడు ఆటతో మంచి ఆరంభాన్ని ఇచ్చారు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులతో నాటౌట్ గా నిలవగా రచిన్ రవీంద్ర 27 పరుగులు చేసారు, లక్ష్యం చిన్నదే కావడంతో చెన్నై జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసి గెలుపొందింది.
ఈ విజయంతో చెన్నై జట్టు మెరుగుపరుచుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానానికి పడిపోయింది.మూడు వికెట్లు తీసి రాజస్థాన్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీసిన సిమర్జీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది