తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈవీఎంలు ఇంకా పోలింగ్ కేంద్రాలకు చేరలేదు. అప్పుడే కూటమి అభ్యర్థులదే గెలుపంటూ కట్టు కథలు వండి వారుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇలా చేయకూడదు. కానీ రామోజీ పత్రికకు అవేమీ పట్టడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే తన సామాజికవర్గం అడ్డగోలుగా దోచుకోవచ్చని భావిస్తోంది.
రోజూ జిల్లా ఎడిషన్లలో, సోషల్ మీడియా పేజీల్లో ఈనాయడు ఎన్డీఏదే గెలుపంటూ డబ్బా కొడుతోంది. ఆ జిల్లాలో ప్రజలంతా కూటమి వైపే ఉన్నారు. ఆ అభ్యర్థులు మాత్రమే మంచివారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు చెడ్డవారు. జనం చంద్రబాబును సీఎం చేసుకోవాలని డిసైడ్ అయిపోయారంటూ రోజూ అదే పనిగా రాస్తోంది. ప్రజలు ఓట్లు వేస్తే విజేత ఎవరో తేలుతారు. అయితే రామోజీరావు మాత్రం నేను చెప్పిన వారు మాత్రమే గెలవాలనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఆ కురవృద్ధుడి రాతల ప్రకారం అన్ని సీట్లలో కూటమే గెలుస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను విలేకరులు దాచేసి చెబుతున్నట్లు ఉన్నారు. బాబు మోసగాడని, హామీలు నెరవేర్చడని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక పొత్తుల కోసం వెంపర్లాడాడని తదితర విషయాలను ఎవరూ ఆ కులపెద్ద చెవిలో చెప్పినట్లు లేదు. తాతా హైదరాబాద్లో ఉండి కాదు.. కాస్త ఏపీలోకి వచ్చి క్షేత్రస్థాయిలో తిరిగి చూడండి. వృద్ధులు నీకు, చంద్రబాబుకు ఎంతలా శాపనార్థాలు పెడుతున్నారో తెలుస్తుంది.
అయినా కులపెద్ద తాతా.. ఇంత వయసొచ్చింది. ఎందుకింత ఆరాటం. జగన్ వల్ల మంచి జరిగిందనిపిస్తే జనం ఓట్లు వేస్తారు. లేకపోతే కూటమికి గుద్దుతారు. మీకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని జనానికి చెప్పు. తప్పు లేదు. బేరీజు వేసుకుంటారు. అంతే కానీ వాళ్లే గెలుస్తారు.. వీళ్లు ఓడిపోతారని నీ మనసులో ఉంది రుద్దకు. ఇప్పటికే ఓ సామాజికవర్గంలో చాలామందిని ఉన్మాదులుగా తయారు చేసేశావు. ఇంకా ఎన్ని జనరేషన్స్ని నాశనం చేస్తావ్. కొండ మీద కట్టుకున్న ఇంద్రభవనం నుంచి ఫిల్మ్ సిటీని చూస్తూ మజ్జిగన్నంలో ప్రియా పచ్చడి నాక్కుంటూ నాలుగు ముద్దలు తిని కృష్ణా.. రామా అనుకోకుండా ఎందుకింత అసూయతో రగిలిపోతున్నావని అడగాలని ఉంది. కాకపోతే సంస్కారం అడ్డు వస్తోంది..