సార్వత్రిక ఎన్నికల అనంతరం నేడు సీఎం జగన్ ఐప్యాక్ టీం తో జరిగిన మీటింగ్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడుతూ మరోసారి మనం చరిత్ర సృష్టించబోతున్నాం. గత ఎన్నికల్లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి అంత కన్నా ఎక్కువ సీట్లే గెలుస్తాం. ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోంది. రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం మొత్తం షాక్ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుందంటూ కుండబద్దలుకొట్టారు.
అలాగే ఐప్యాక్ టీంతో ఉండి ఇప్పుడు దూరం జరిగి చంద్రబాబు దగ్గరికి చేరిన ప్రశాంత్ కిశోర్ పై కూడా జగన్ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ఉహించలేనన్ని సీట్లు మనకి వస్తాయని, ప్రశాంత్ కిషోర్ చేసేది ఏమీ లేదని, కష్టం అంతా టీం చేస్తుందని, వచ్చే మన ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేయడానికి సిద్దంగా ఉన్నానని, రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఐప్యాక్ టీంతో జగన్ అన్నారు.
విజయవాడ బెంజిసర్కిల్‌లో ఉన్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన ఈ వాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. గెలుపుపై తెలుగుదేశం నేతలు ముందు స్పందించినా తరువాత పోలింగ్ సరళిని గమనించి ఫలితాలు తమకు అనుకూలంగా రావనే అంచనాకి వచ్చినట్టు సమాచారం. అయితే జగన్ మాత్రం 175 టార్గెట్ గా ఎన్నికల యుద్దంలోకి దిగి యుద్దం ముగిసిన తరువాత కూడా గెలుపుపై అదే స్థాయిలో కాన్ఫిడెంట్ గా ఉండటం చూసిన రాజకీయ విశ్లేషకులు జగన్ ధీమాకి ఆయనకి అనుకూలంగా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయని తమ అభిప్రాయాలని వెల్లడిస్తున్నారు.