ఎన్నికలకు ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ తాజాగా రోజుకి మూడు బహిరంగ సభలను నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా నరసాపురం స్టీమర్ రోడ్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే… నరసాపురం సిద్ధమా? సమయం 12.15 మిట్టమధ్యాహ్నం ఇంతటి […]
రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మరోసారి తన నోటి దూలతో మహిళల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కొన్నారు. బుచ్చయ్య చౌదరి తన నియోజకవర్గ పరిధిలో 27వ డివిజన్లో ప్రచారానికి చేరుకున్న సందర్భంలో అక్కడ వున్న మహిళలు టీడీపీ అధికారంలో తమకేమి మేలు జరగలేదని మీకెందుకు ఓట్లు వేయాలంటూ నిలదీశారు . దీనితో ఆగ్రహించిన బుచ్చయ్య వారిని మీ అంతూ చూస్తాను చెప్పుతో కొడతాను అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . అంతే కాకుండా […]
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీని అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. సర్కారుకు ఇది గుడిబండలా మారిందని పీసీసీ పెద్దలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. అక్కడ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి.. కర్ణాటకను స్ఫూర్తిగా తీసుకుని ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. అందులో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం పేరుతో హడావుడి చేశారు. తీరా చూస్తే ప్రజలను మోసం చేశారు. కేవలం […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇంకో 10 రోజుల్లో జరగనున్నాయి. దీంతో వివిధ పార్టీలన్నీ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేతికి మైక్ చిక్కడం ఆలస్యం అధికార పార్టీ ఎమ్మెల్యేలపై, ముఖ్యమంత్రి జగన్ పై ముఖ్యమంత్రా, వాడెమ్మ మొగుడా, చెప్పుతో కొడతా, చొక్కా పట్టుకు ఈడుస్తా, అధః పాతాళానికి తొక్కేస్తా, బంగాళాఖాతంలో కలిపేస్తా అంటూ నోటికి ఏం మాటలు వస్తున్నాయో తెలియని విధంగా ఆవేశంతో ఊగిపోతూ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం క్రితమే పాఠశాల విద్యా శాఖ నుంచి పదో తరగతి విద్యార్థుల వివరాలన్నీ గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థకు, అక్కడి నుంచి వీఆర్వోలకు చేర్చింది. వీఆర్వోలు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి సమగ్ర విచారణ జరిపిన తర్వాత, స్థానిక గ్రామ/వార్డు సచివాలయం నుంచి వాలంటీర్ల ద్వారా ఆయా విదార్థుల కుటుంబాల సభ్యులందరి పేర్ల మీద కుల ధృవీకరణ పత్రాల్ని ఇంటికే చేర్చేలా విధివిధానాలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు శాశ్వత కుల ధృవీకరణ […]
విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, కేశినేని చిన్ని పోటీ పడుతున్నారు. కాగా సోదరుల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కేశినేని చిన్నిపై విరుచుకుపడ్డారు. క్రిమినల్ అయిన కేశినేని చిన్నికి టీడీపీ ఎంపీగా సీటు ఇచ్చింది. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు కేశినేని నాని. చిన్నీ రియల్ ఎస్టేట్ దందాల కోసం తన వందల స్టిక్కర్లు […]
రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ ప్రాంతానికి చెందిన వారైనా సొంత నియోజక వర్గానికి కొంత అధికంగా కేటాయింపులు చేయడం, నియోజక వర్గాన్ని మిగతా నియోజక వర్గాల కన్నా అధికంగా అభివృద్ధి చేసుకోవడం సహజం. ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కన్నా ఎంతో ముందున్నారు ఏపీ సీఎం జగన్ . 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కుప్పం నియోజక వర్గానికి ఏమి చేసాడంటే వేలెత్తి చూపించడానికి సరైన అభివృద్ధి ఒక్కటి కూడా కనపడకపోవటం దురదృష్టకరం. ఆ […]
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో ఏ ఏ కులాలలో ఎంతమంది జనాభా ఉన్నారనేది అధికారిక సమాచారం అందుబాటులో లేకపోయినా ఎన్నికల వేల ఆయా నియోజక వర్గాలలోని ప్రతి రాజకీయ పార్టీ వద్ద కాస్త అటూ ఇటుగా అంచనా ఉంటుంది. దాన్ని బట్టే ఆయా పార్టీల నాయకులు రాజకీయ వ్యవహారాలు నడపటం జనాభా ప్రాతిపదికన కుల నాయకులకు ప్రాధాన్యం ఇవ్వటం, ప్రచారం చేయించటం లాంటి చర్యలతో కులాల వారీగా ఓటర్లని ఆకర్శించే ప్రయత్నం చేస్తారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా […]
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న గత 14ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి ఏవిధంగా కొమ్ముకాసేవారో కొత్తగా చెప్పనవసరం లేదు. అటువంటి చంద్రబాబు నేడు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాం అంటూ కురిపిస్తున్న హామీలు చూస్తే మరోసారి మోసం చేయడానికి బాబు బయలుదేరారని ఇట్టే అర్ధమయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే భద్రత పెరిగి సోమరులవుతారనే అర్ధం వచ్చేలా ఆయన తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన […]
ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు కూటమి అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సాక్షాత్తు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వారిని మచ్చిక చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికల సభల్లో వారి టోపీ పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. ప్రచార రథం ఎక్కించుకుని హామీలు గుప్పిస్తున్నాడు. నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ముస్లిం నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీ పడేసిన సీట్లు తీసుకుని పోటీ చేస్తున్న బీజేపీ నేతలు తమ నియోజకవర్గాల్లో ముస్లింలను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు […]