కాగా ఈ మేనిఫెస్టో ప్రకటించిన మొదల్లో పెన్షన్ సూపర్ సిక్స్ లో ఉండేది, కానీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజుల నుంచి వార్తాపత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ ని దూరం చేశారు.
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేనలు ప్రజాగళం పేరుతో మేనిఫెస్టోను తీసుకొచ్చారు. కాగా ఈ మేనిఫెస్టో ప్రకటించిన మొదల్లో పెన్షన్ సూపర్ సిక్స్ లో ఉండేది, కానీ మేనిఫెస్టో ప్రకటించిన రెండు రోజుల నుంచి వార్తాపత్రికల్లో ఇస్తున్న ప్రకటనలు సూపర్ సిక్స్ నుంచి పెన్షన్ ని దూరం చేశారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని మాయం చేసింది ఇప్పుడు చూస్తే ప్రకటించిన రెండు రోజులకే పథకాన్ని మాయం చేసిందని పేర్ని నాని మచిలీపట్నంలో మీడియా సమావేశంలో అన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. బీజేపీతో తాను కలిశానంటే ఐదు కోట్ల ప్రజల శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమేనని చంద్రబాబు చెప్పడంపై పేర్ని నాని మండిపడ్డారు . ఇదే చంద్రబాబు గతంలో మోడీని టెర్రరిస్ట్ అని, నేడు నెత్తిన పెట్టుకోవడం చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కావడం లేదని, కూటమి పొత్తుల్లో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో మోదీ ఫోటో ఎందుకు లేదు అని అడిగారు. మొన్నటి వరకు ముగ్గురు ఫోటోలతో ప్రచారం చేసిన చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసే సమయానికి కేవలం పవన్, చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు మేనిఫెస్టో పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పథకాలకు పేర్లు మార్పు చేసి మేనిఫెస్టోను టీడీపీ వారు తయారు చేశారని అన్నారు.
చంద్రబాబు, పవన్ కూటమి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదన్నారు. గతంలో 2014 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన మేనిఫెస్టోతో ఇంటింటికీ ప్రచారం చేశారన్నారు. ఆ మేనిఫెస్టో కాగితంపై చంద్రబాబు సంతకం కూడా చేశారన్నారు. తాజాగా కూటమి మేనిఫెస్టో గురించి సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఒక పత్రిక ప్రకటనలో పవన్ ఫోటో కూడా మాయమైందని కేవలం చంద్రబాబు ఫోటో ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు. 2014లో కూటమి తరుపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ టీడీపీ మేనిఫెస్టో అమలు చేయకపోతే నాకేం సంబంధం అన్న మాటలు మనం చూసాంమని గతంలో సూపర్ 6లో పెన్షన్ రూ. 4 వేలు ఇస్తామని చెప్పి తాజాగా ఆ పథకాన్ని సూపర్ 6 నుంచి ఎక్కడా కనపడకుండా చేశారన్నారు. మేనిఫెస్టో పైన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫోటో కూడా లేకుండా చేశారు. రామారావుకి తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.