చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న గత 14ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగానికి ఏవిధంగా కొమ్ముకాసేవారో కొత్తగా చెప్పనవసరం లేదు. అటువంటి చంద్రబాబునేడు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తాం అంటూ కురిపిస్తున్న హామీలు చూస్తే మరోసారి మోసం చేయడానికి బాబు బయలుదేరారని ఇట్టే అర్ధమయిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే భద్రత పెరిగి సోమరులవుతారనే అర్ధం వచ్చేలా ఆయన తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తే చాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి వ్యక్తి 20 లక్షల ఉద్యోగాల్లు ఇస్తానని హామీ ఇవ్వడం చూస్తే 2014 మానిఫెస్టోలో పెట్టిన ఇంటికో ఉద్యోగం మాదిరి అబద్దపు హామీనే అని ఇట్టే అర్ధమవుతుంది.
ఇక ప్రభుత్వ స్కూళ్ళ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు వచ్చీ రాగానే సుమారు 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. పేదలకు విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని ఆ పని ప్రైవేటు విద్యా సంస్థలు భుజాన్న వేసుకోవాలని బహిరంగ సభల్లోనే చెప్పిన ఘనుడు చంద్రబాబు. అటువంటి చంద్రబాబు నేడు జగన్ మానస పుత్రిక అయినఅమ్మ ఒడి పథకాన్నే కాపీ కొట్టి తల్లికి వందనం అంటూ డబ్బు ఇస్తాను అంటే ఏ తల్లైనా నమ్ముతుందా ? పేదోడికి ఇంగ్లీష్ విద్య నేర్పిస్తే మొద్దబ్బాయిలవుతారు అన్న చంద్రబాబు పేదోడికి మంచి విద్య అందిస్తాను అనడం ఎంత హాస్యాస్పదం. కేవలం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న ఈ అబద్దపు హామీలని నమ్మి ప్రభుత్వ రంగాలని నిర్వీర్యం చేసిన చంద్రబాబుని ప్రజలు నమ్మి ఓట్లు వేసే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న మాట. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తమకి మేలు చేస్తున్న వారు ఎవరో బూటకపు హామీలతో గద్దెనెక్కుదాం అని కాచుకుని కూర్చున్నది ఎవరో తెలుసుకోలేని అమాయకులు ఓటర్లు కాదని చంద్రబాబు ఎప్పుడు తెలుసుకుంటారో మరి. ఇది చంద్రబాబు గ్రహిస్తేనే ఆయనకి రాజకీయ మనుగడ .