కన్నడ హీరో యష్ కెజిఎఫ్ తరువాత కొంతకాలం బ్రేక్ తీసుకున్నారు. గ్యాప్ తరువాత రెండు సినిమాలకు పనిచేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందులో ఒకటి నితీష్ తివారీ తీస్తున్న రామాయణం కాగా మరొకటి మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్.. రామాయణంలో రావణుడి పాత్రలో యష్ నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో టాక్సిక్ ని నిర్మిస్తుండగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్లపై ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ ముగ్గురు హీరోయిన్లు ఫైనల్ అయ్యారనే రూమర్స్ వినబడుతున్నాయి. కరీనాకపూర్, కియారా అద్వానీ, శ్రుతి హాసన్ ఈ చిత్రంలో నటించనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాగా ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. టాక్సిక్ సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది.
కాగా కేజిఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యష్ కన్నడ బాక్స్ ఆఫీస్ లో బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. అనంతరం యష్ చేస్తున్న ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం యష్ నటిస్తున్న టాక్సిక్ ని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. మరోసారి కేజీఎఫ్ తరహాలో బాక్స్ ఆఫీస్ పై యష్ దండయాత్ర చేస్తాడో లేదో వేచి చూడాలి.