ఐపీఎల్ 2024 భాగంగా నేడు కోల్కత్తా నైట్ రైడర్స్ తో ఢిల్లీ కాపిటల్స్ జట్టు తలపడనుంది . కోల్కత్తా నైట్ రైడర్స్ ఫస్ట్ నుంచి మంచి ఫెర్ఫార్మెన్స్ చూపుతుంది. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. అయితే అదే సమయంలో ఢిల్లీ జట్టు తొలిదశలో అన్నీ వైఫల్యాలే. కానీ ఆ తర్వాత వరస విజయాలతో దూసుకు పోతుంది. ఇలా ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ఈ సీజన్లో కేకేఆర్ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. ఇప్పుడిప్పుడే విజయాల బాటపట్టిన ఢిల్లీ జట్టు ఆడిన 10 మ్యాచ్ లలో 5 విజయాలతో ఆరో స్థానంలో నిలిచింది.రాత్రి 7.30 గంటలకు కోల్కత్తాలో జరిగే ఈ మ్యాచ్ లో ఎవరిది విజయం అన్నది తేలనుంది.