ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లో వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతుంది , ఈ విజయంతో రాజస్థాన్ ఎనిమిదవ విజయాన్ని నమోదు చేసుకుని ప్లే ఆఫ్ కి చేరువైంది . ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు ( 8 ఫోర్లు , 2 సిక్స్ లు ) దీపక్ హూడా 31 బంతుల్లో 50 పరుగులు (7 ఫోర్లు ) లతో ఆ జట్టు భారీ స్కోర్ చేయగలిగింది .
రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు తీసుకోగా , ట్రెంట్ బౌల్ట్ , ఆవేశ్ ఖాన్ , అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.
భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్
19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్నారు. ఓపెనర్లు అధ్బుత ఆరంభాన్ని ఇచ్చినా వెంట వెంటనే వికెట్లు పడటంతో లక్ష్య ఛేదనలో వెనుకబడినట్టు కనిపించినా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ , మరో ఆటగాడు జురెల్ తో జట్టును ముందు ఉండి నడిపించారు . శాంసన్ 33 బంతుల్లో 71 పరుగులు ( 7 ఫోర్లు , 4 సిక్స్ లు ) జురెల్ 34 బంతుల్లో 52 పరుగులు ( 5 ఫోర్లు , 2 సిక్స్ లు ) లతో జట్టును విజయ తీరాలకు చేర్చి అజేయంగా నిలిచారు .
లక్నో బౌలర్లలో యష్ ఠాకూర్ , స్టోనిస్ , మిశ్రా లకు చెరో వికెట్ లభించాయి, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.