పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో పలువురు పార్టీలో చేరారు. గుంటూరు జనసేన అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, మార్వాడీ కమ్యూనిటీ ప్రెసిడెంట్ తివారి, జనసేన పార్టీ క్రియాశిల నాయకులు ఆరికట్ల శ్రీనివాసరావు, కమతం వెంకట్రావు, పెద్ద ఎత్తున వారి అనుచరులు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ను రెండోసారి సీఎంను చేసేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడి సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదన్నారు. 1999 నుండి 2019 వరకూ ఇచ్చిన హామీల్ని ఒక్కదాన్ని కూడా సక్రమంగా అమలు చేయని చంద్రబాబు నేడు సూపర్ సిక్స్, అమ్మకి వందనం, అయ్యకి పప్పు బెల్లం అంటే నమ్మటానికి ప్రజలు అమాయకులు కాదని జనసేన నేత శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
పవన్ నమ్ముకొన్న కాపులకి తీవ్ర అన్యాయం చేసాడని, కాపులకి రాజ్యాధికారం అనే ఆలోచన పోయి, కాపులని చంద్రబాబుకి ఊడిగం చేయించే స్థితికి కాపుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్ద ఆత్మగౌరవం చంపుకుని పని చేయటం ఇష్టం లేక మేనిఫెస్టోని భగవద్గీతలా భావించి చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్న జగన్ చిత్తశుద్ధికి ఆకర్షితులమై వైఎస్సార్సీపీలో చేరుతున్నానని వ్యాఖ్యానించారు నేరెళ్ల సురేష్ .
జగన్ పర్యటనలు మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో చేరికలు ఇంకా పెరిగే అవకాశం కనపడుతుంది .